MLA MS RAJU : దేశ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం
ABN , Publish Date - Sep 06 , 2024 | 12:05 AM
దేశ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకం అని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి అన్నారు. భావిభారత పౌరులను తీర్చిదిద్దే బాధ్యత వారిపైనే ఉందన్నారు. పట్టణంలోని ఉపాధ్యాయ భవనలో గురువారం ఉపా ధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు.
ఉపాధ్యాయ దినోత్సవంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు
మడకశిరటౌన, సెప్టెంబరు 5 : దేశ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకం అని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి అన్నారు. భావిభారత పౌరులను తీర్చిదిద్దే బాధ్యత వారిపైనే ఉందన్నారు. పట్టణంలోని ఉపాధ్యాయ భవనలో గురువారం ఉపా ధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... అలాంటి ఉపాధ్యాయులపై దేశంలోనే కక్ష కట్టిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అప్పట్లో జగన పేరే వినిపించేదన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఉపాధ్యా యులను టార్గెట్ చేసి, వారిని చాలా ఇబ్బందులకు గురిచేసిన ఘనత దక్కిం చుకుందన్నారు.
టెక్నాలజీ ఎంత పెరిగినా ఉపాధ్యాయులకు ప్రత్యామ్నాయం కాదన్నారు. ఉపాధ్యాయులు సర్వేపల్లి రాధాకృష్ణను ఆదర్శంగా తీసుకొని విలువలతో కూడిన విద్యను అందించాలన్నారు. వెనుకబడిన మడకశిర ని యోజకవర్గంలోని పేద విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగేందుకు మీరు కృషి చేయాలన్నారు. పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఉపాధ్యాయుల స మస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని, గ్రామీణ ప్రాం తాల్లో విద్యార్థులకు మెరుగైన విద్య అందేలా సహకరించాలని కోరారు. కార్య క్రమంలో ఎంఈఓ శ్రీనివాసభాస్కర్, ఎంఈఓ-2 నరసింహమూర్తి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి, మాజీ ఎమ్మెల్యే వైటీ ప్రభాకర్‌రెడ్డి, కమీషనర్ రంగస్వామి, విశ్రాంత ఎంఈఓ గోపాల్, మండల కన్వీనర్ లక్ష్మీనారాయణ, మనోహర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....