Clocktower underpass : ఓటుకు రూటు..!
ABN , Publish Date - May 25 , 2024 | 12:42 AM
వర్షాకాలం మొదలైంది. పాత భవంతులు, బ్రిడ్జిలు కూలిపోయే ప్రమాదం ఉంటుంది. ‘అప్రమత్తంగా ఉండండి’ అని అధికారులు హెచ్చరిక బోర్డులు పెడుతుంటారు. ఒక్కోసారి రాకపోకలను నిలిపేసి.. దారి మళ్లిస్తుంటారు. ఇది రొటీన..! కానీ అనంతపురం నగరంలోని కొత్త ఫ్లైఓవర్ ‘అండర్ పాస్’ రాకపోకలను అధికారులు నిషేధించారు. దీన్ని ప్రారంభించి నెల గడిచిందేమో.. అంతే..! అంతలోనే మూసేయడం చర్చనీయాంశం అయ్యింది. ‘ఈ రోడ్డు అండర్ బ్రిడ్జి బీఆర్71ఏ భద్రత కారణంగా మూసివేయబడింది’ అని ఒక హెచ్చరిక బోర్డు పెట్టారు. ఎన్నికల సమయంలో హడావుడిగా ప్రారంభించడం ఏమిటో.. పోలింగ్ పూర్తవ్వగానే మూసేయడం ఏమిటో..! అని నగర ప్రజలు నిట్టూరుస్తున్నారు. ...
ఎన్నికల కోసం ప్రారంభించారు..
పోలింగ్ పూర్తవ్వగానే మూసేశారు..!
క్లాక్‌టవర్ అండర్ పాస్ బంద్‌పై చర్చోపచర్చలు
వర్షాకాలం మొదలైంది. పాత భవంతులు, బ్రిడ్జిలు కూలిపోయే ప్రమాదం ఉంటుంది. ‘అప్రమత్తంగా ఉండండి’ అని అధికారులు హెచ్చరిక బోర్డులు పెడుతుంటారు. ఒక్కోసారి రాకపోకలను నిలిపేసి.. దారి మళ్లిస్తుంటారు. ఇది రొటీన..! కానీ అనంతపురం నగరంలోని కొత్త ఫ్లైఓవర్ ‘అండర్ పాస్’ రాకపోకలను అధికారులు నిషేధించారు. దీన్ని ప్రారంభించి నెల గడిచిందేమో.. అంతే..! అంతలోనే మూసేయడం చర్చనీయాంశం అయ్యింది. ‘ఈ రోడ్డు అండర్ బ్రిడ్జి బీఆర్71ఏ భద్రత కారణంగా మూసివేయబడింది’ అని ఒక హెచ్చరిక బోర్డు పెట్టారు. ఎన్నికల సమయంలో హడావుడిగా ప్రారంభించడం ఏమిటో.. పోలింగ్ పూర్తవ్వగానే మూసేయడం ఏమిటో..! అని నగర ప్రజలు నిట్టూరుస్తున్నారు. నాలుగు రోజుల క్రితం నగరంలో భారీ వర్షం కురిసింది. వృక్షాలు, విద్యుత స్తంభాలు కూలిపోయాయి. వర్షపు నీరు, మురుగునీరు కలిసి రోడ్లు, కాలనీలను
ముంచెత్తాయి. ఇదే సమయంలో క్లాక్ టవర్ అండర్ పాస్ కింద కూడా భారీగా నీరు చేరింది. అక్కడ రాకపోకలను హఠాత్తుగా నిలిపేయడంతో డ్రైనేజీ సమస్యనా..? లేక నిర్మాణంలో లోపాలున్నాయో...? అనే చర్చ మొదలైంది.
అధికారులు ఏమంటున్నారంటే..
ఆర్‌అండ్‌బీ, నేషనల్ హైవే(ఎనహెచ) అధికారులు మాత్రం తమదైన శైలిలో క్లారిటీ ఇచ్చారు. అండర్ పాస్ బ్రిడ్జికి కింద గ్యాప్ కేవలం 3.5 మీటర్లు ఎత్తు ఉందట..! కార్లు, బైక్‌లు మినహా భారీ వాహనాలు వెళితే ఇరుక్కుపోయే ప్రమాదం ఉందట..! అలా జరగకుండా.. ఆ మార్గంలో భారీ వాహనాలు వెళ్లకుండా తగినంత ఎత్తులో పొడవాటి స్టీల్ గడ్డర్‌తో సేఫ్టీ బ్యారికేడ్ ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. తద్వారా అండర్‌పా్‌సలోకి వెళ్లకుండానే భారీ వాహనాలు దారి మళ్లుతాయని అంటున్నారు. బ్రిడ్జి స్లాబ్ కింద ఉన్న గడ్డర్స్ బేరింగ్‌లను రైల్వే శాఖ పరీక్షించాల్సి ఉందని కూడా చెబుతున్నారు. కింద నుంచి పరిశీలించడానికి వీలుండదని, పైకెక్కి తనిఖీ చేయడం కోసం ఒక స్టేజ్ లాంటిది ఏర్పాటు చేస్తున్నామని అంటున్నారు. ఈ రెండు ప్రక్రియలు పూర్తి చేయడానికే తాత్కాలికంగా వాహనాల రాకపోకలను
నిలుపుదల చేశామని ఎనహెచ ఈఈ సుధాకర్‌రెడ్డి అంటున్నారు. మరో 15 రోజుల్లో ఆ పనులను పూర్తి చేసి, రాకపోకలకు అనుమతిస్తామని అంటున్నారు. సరే..! మరీ ఇవన్నీ పూర్తి చేయకుండా అండర్ బ్రిడ్జిలో రాకపోకలకు అంత అత్యవసరంగా ఎందుకు అనుమతించినట్లు..? అధికారులు చెప్పినట్లుగా.. పొరపాటున ఏదైనా భారీ వాహనం ఇరుక్కుపోయి ఉంటేనో..! పోనీ.. ఏదో ట్రయల్ రన అని చెప్పి ఉండొచ్చు కదా..? జనం మాత్రం ఓట్ల కోసం ఇలా హడావుడి చేశారని అంటున్నారు మరి..!
- అనంతపురం క్రైం
మరిన్ని అనంతపురం వార్తల కోసం....