Share News

MLA DAGGUPATI : వైసీపీ పాలనతో రాష్ట్రం అప్పుల పాలు

ABN , Publish Date - Dec 01 , 2024 | 12:06 AM

గత వైసీపీ ప్రభు త్వ నిర్వాకంతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఎమ్మెల్యే దగ్గు పాటి వెంకటేశ్వరప్రసాద్‌ విమర్శించారు. అనంతపురం అర్బన పరిధిలోని 9, 49వ డివిజనలలో శనివారం టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యా దవ్‌తో కలిసి ఎమ్మెల్యే పలువురు లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు.

MLA DAGGUPATI :  వైసీపీ పాలనతో రాష్ట్రం అప్పుల పాలు
MLA Daggupati Prasad giving pension to an old lady

పింఛన్ల పంపిణీలో ఎమ్మెల్యే దగ్గుపాటి

అనంతపురం అర్బన, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి) : గత వైసీపీ ప్రభు త్వ నిర్వాకంతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఎమ్మెల్యే దగ్గు పాటి వెంకటేశ్వరప్రసాద్‌ విమర్శించారు. అనంతపురం అర్బన పరిధిలోని 9, 49వ డివిజనలలో శనివారం టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యా దవ్‌తో కలిసి ఎమ్మెల్యే పలువురు లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.... ఎన్ని ఇబ్బందులున్నా... ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెలా ఒకటో తేదీనే లబ్ధిదారులకు ఇంటి వద్దనే పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. మాజీ మేయర్‌ స్వరూప, తలారి ఆదినారాయ ణ, గాజుల ఆదెన్న, గంగారామ్‌, రాయల్‌ మురళి, సరిపూటి రమణ, సుధా కర్‌ యాదవ్‌, రాజారావు, పోతుల లక్ష్మీ నరసింహులు, కడియాల కొండన్న, పీఎల్‌ఎన మూర్తి, లక్ష్మీనరసింహ, దళవాయి వెంకటనారాయణ, మధు రాయల్‌, రమేష్‌, ఓంకార్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, రాంబాబు, స్వప్న, సంగా తేజస్విని, శాంతిసుధ, కంఠాదేవి, చరిత తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Dec 01 , 2024 | 12:06 AM