THEFT: ధర్మవరంలో దొంగల హల్‌చల్
ABN , Publish Date - Dec 18 , 2024 | 12:10 AM
పట్టణంలో సోమవారం అర్ధరాత్రి దొంగలు హల్‌చల్ చేశారు. ప్రియాంకనగర్‌లో పుట్టపర్తి రహదారి పక్కనగల కాంప్లెక్స్‌లోని నాలుగు దుకాణాల్లో చోరీ చేశారు. షట్టర్లను ఇరువైపులా వంచి, తాళాలను పక్కకు జరిపి లోపలకు చొరబడ్డారు.
ధర్మవరం, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): పట్టణంలో సోమవారం అర్ధరాత్రి దొంగలు హల్‌చల్ చేశారు. ప్రియాంకనగర్‌లో పుట్టపర్తి రహదారి పక్కనగల కాంప్లెక్స్‌లోని నాలుగు దుకాణాల్లో చోరీ చేశారు. షట్టర్లను ఇరువైపులా వంచి, తాళాలను పక్కకు జరిపి లోపలకు చొరబడ్డారు. ప్రభాకర్‌కు చెందిన ఆటో మొబైల్స్ షాపులో రూ.15వేలు, మహేశకు చెందిన హార్డ్‌వేర్ షాపులో రూ.20వేలు, నాగార్జునకు చెందిన పెయింట్స్ షాపులో రూ.50వేలు, పవనకు చెందిన దుస్తుల దుకాణంలో రూ.15వేలు నగదుతోపాటు వసా్త్రలు, వస్తువులను ఎత్తికెళ్లినట్లు బాఽధితులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు వనటౌన పోలీసులు షాపులను పరిశీలించారు. సీసీ టీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. అందులో ఇద్దరు దొంగలు మొహాలకు మాస్క్‌లు వేసుకుని కనపించారు. ఆ మేరకు ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి, తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. వారు హిందూపురం ప్రాంతానికి చెందిన వారని సమాచారం. పోలీసులు పట్టణంలో నిఘా పెంచి, రాత్రి సమయాల్లో గస్తీ నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.