Topudurthi batch : రూ.6.50 కోట్లు దోచిన తోపుదుర్తి బ్యాచ
ABN , Publish Date - Aug 08 , 2024 | 12:15 AM
నసనకోట ముత్యాలమ్మ ఆలయంలో గడిచిన ఐదేళ్లలో రూ.6.50 కోట్ల దోపిడీ జరిగిందని నసనకోట పంచాయతీ ప్రజలు ఆరోపించారు. ఆలయ ఆవరణలోని గదులు, వ్యాపార అనుమతులకు బుధవారం నిర్వహించిన వేలంపాటలో రూ.89.65 లక్షల ఆదాయం వచ్చిందని, దీని ప్రకారం లెక్కవేస్తే దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో అర్థమౌతుందని అన్నారు. దోపిడీ వెనుక అప్పటి ఎమ్మెల్యే ప్రకా్‌షరెడ్డి బ్యాచ ఉందని ఆరోపించారు. ఆలయ కమిటీ మాజీ సభ్యులు రామ్మూర్తినాయుడు, ఈఓ వెంకటేశ్వర్లు, దేవదాయశాఖ జిల్లా ఇనస్పెక్టర్, పోలీసు ...
నసనకోట గ్రామస్థుల మండిపాటు
రామగిరి, ఆగస్టు 7: నసనకోట ముత్యాలమ్మ ఆలయంలో గడిచిన ఐదేళ్లలో రూ.6.50 కోట్ల దోపిడీ జరిగిందని నసనకోట పంచాయతీ ప్రజలు ఆరోపించారు. ఆలయ ఆవరణలోని గదులు, వ్యాపార అనుమతులకు బుధవారం నిర్వహించిన వేలంపాటలో రూ.89.65 లక్షల ఆదాయం వచ్చిందని, దీని ప్రకారం లెక్కవేస్తే దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో అర్థమౌతుందని అన్నారు. దోపిడీ వెనుక అప్పటి ఎమ్మెల్యే ప్రకా్‌షరెడ్డి బ్యాచ ఉందని ఆరోపించారు. ఆలయ కమిటీ మాజీ సభ్యులు రామ్మూర్తినాయుడు, ఈఓ వెంకటేశ్వర్లు, దేవదాయశాఖ జిల్లా ఇనస్పెక్టర్, పోలీసు అధికారులు, గ్రామస్థుల సమక్షంలో వేలంపాట నిర్వహించారు. హుండీ, దుకాణాల
వేలం నిర్వహించాల్సి ఉంది. అందులో కూడా రూ.60 లక్షలదాకా ఆదాయం వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఐదేళ్లలో రూ.కోటి ఆదాయం సమకూరినట్లు ప్రకాశ రెడ్డి బ్యాచ చూపించిందని, మిగిలిన సొమ్మును మాజీ ఎమ్మెల్యే ప్రకా్‌షరెడ్డి, ఆలయ కమిటీ చైర్మనగా ఉన్న కురుబ ముత్యాలు, బీసీ ముత్యాలు ఆలయ ఈఓ, పూజారులు దోచుకున్నారని ఆరోపించారు. గత ఐదేళ్లలో ఆదాయ వ్యయాల వివరాలను బహిర్గతం చేయాలని వారు డిమాండ్ చేశారు. సమగ్ర విచారణ జరిపి, బాఽధ్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....