వైసీపీ నాయకుల దౌర్జన్యం
ABN , Publish Date - May 14 , 2024 | 12:56 AM
వైసీపీ నాయకులు, కార్యకర్తలు అన్ని పోలింగ్ కేంద్రాల్లోకి చుట్టాళ్లా వెళ్లి వచ్చారు. దీంతో టీడీపీ నాయకులు అభ్యంతరం తెలిపారు. పోలీసుల దృష్టికి తీసుకెళ్లిన వారు పట్టించుకోలేదు.
విడపనకల్లు, మే 13: వైసీపీ నాయకులు, కార్యకర్తలు అన్ని పోలింగ్ కేంద్రాల్లోకి చుట్టాళ్లా వెళ్లి వచ్చారు. దీంతో టీడీపీ నాయకులు అభ్యంతరం తెలిపారు. పోలీసుల దృష్టికి తీసుకెళ్లిన వారు పట్టించుకోలేదు. మధ్యాహ్నం వరకూ చూసినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో విసిగిపోయిన టీడీపీ నాయకులు వాదనకు దిగారు. 26వ పోలింగ్ బూతకు సిద్దు అనే వైసీపీ కార్యకర్త ఏజెంట్‌గా ఐడీ చూపించాడు. కానీ సిద్దు అనే కార్యకర్త 23, 24, 25వ పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లటంతో టీడీపీ నాయకులు అతన్ని బయటకు రావాలని ఆందోళన చేశారు. వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయి టీడీపీ నాయకుడు హనుమంతుపై దాడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. వైసీపీవారిని చెదరగొట్టారు.