EX MINISTER USHASRI: పోలీసుస్టేషనలో ఉషశ్రీ హల్‌చల్
ABN , Publish Date - Dec 02 , 2024 | 12:24 AM
‘ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కేసు వద్దు రాజీ అవుతామని చెప్పినా ఉద్దేశ్యపూర్వకంగా కుటుంబాన్ని వేధిస్తూ రాత్రంతా ఓ రైతును ఆసుపత్రికి పంపకుండా పోలీస్ స్టేషనలో పెట్టడం దారుణం.. అక్రమ నిర్బంధాలు సరికాదు, పోలీసుల తీరు మారాలి’ అంటూ పెనుకొండ పోలీస్ స్టేషనలో వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉష శ్రీచరణ్ ఆదివారం పోలీసులపై చిందులు తొక్కారు.
అన్నదమ్ముల భూవివాదంలో ఒకరికి గాయాలు
బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు
నిందితుడికి 14 రోజుల రిమాండ్
పెనుకొండ రూరల్, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): ‘ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కేసు వద్దు రాజీ అవుతామని చెప్పినా ఉద్దేశ్యపూర్వకంగా కుటుంబాన్ని వేధిస్తూ రాత్రంతా ఓ రైతును ఆసుపత్రికి పంపకుండా పోలీస్ స్టేషనలో పెట్టడం దారుణం.. అక్రమ నిర్బంధాలు సరికాదు, పోలీసుల తీరు మారాలి’ అంటూ పెనుకొండ పోలీస్ స్టేషనలో వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉష శ్రీచరణ్ ఆదివారం పోలీసులపై చిందులు తొక్కారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అన్నదమ్ముల భూవివాదంలో శనివారం జరిగిన ఘర్షణలో ముకుంద అనే రైతు గాయపడ్డాడు. ముకుంద, అతడి తల్లి రామాంజినమ్మ ఫిర్యాదు మేరకు.. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదుచేసి నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరచగా 14రోజుల రిమాండు విధించారు. మావటూరు గ్రామంలో చాకలి అంజినప్ప, చాకలి సుబ్బయ్య అన్నదమ్ములు. చాకలి సుబ్బయ్య భార్య ముత్యాలమ్మపేరిట ప్రధాన రహదారిలో నాలుగు ఎకరాల భూమి ఉంది. చాకలి అంజినప్ప, చాకలి సుబ్బయ్య కుమారులైన శ్రీనివాసులు, ముకుంద ఉమ్మడిగా సాగుచేసుకుంటున్నారు. శనివారం చాకలి శ్రీనివాసులు సాగు భూమిలో ముకుంద సాగుచేస్తున్న పొలం నీరు వెళ్లకుండా అడ్డుకట్టవేశాడు. ఈ క్రమంలో జరిగిన గొడవలో శ్రీనివాసులు చేతిలో ఉన్న చెలికిపారతో ముకుంద తలపై మోదాడు. తీవ్ర రక్త గాయమైన ముకుంద, తల్లి రామలక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వెంకటేశ ్వర్లు కేసు నమోదుచేశారు. విచారణ అనంతరం శ్రీనివాసులుపై 307కేసు నమోదుచేసి కోర్టుకు హాజరు పరచగా న్యాయాధికారి 14రోజుల రిమాండు విధించారు. విషయం తెలుసుకున్న వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉష శ్రీచరణ్ స్టేషనకు చేరుకుని అన్నదమ్ముల గొడవ రాజీచేస్తారని మీవద్దకు వస్తే హత్యాయత్నం కేసు ఎలా నమోదు చేశారని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.