భూపోరాట యోధుడు వెంగమనాయుడు
ABN , Publish Date - Jul 13 , 2024 | 12:04 AM
పేద, బడుగు, బలహీనవర్గాల తరపున భూ పోరాటాలు చేసిన గొప్ప యోధుడు వెంగమనాయుడని సీపీఐ నాయకులు కొనియాడారు. శుక్రవారం ఆ పార్టీ కార్యాలయంలో నగర కార్యదర్శి శ్రీరాములు అధ్యక్షతన వెంగమనాయుడు 27వ వర్ధంతిని నిర్వహించారు.
అనంతపురం విద్య, జూలై 12: పేద, బడుగు, బలహీనవర్గాల తరపున భూ పోరాటాలు చేసిన గొప్ప యోధుడు వెంగమనాయుడని సీపీఐ నాయకులు కొనియాడారు. శుక్రవారం ఆ పార్టీ కార్యాలయంలో నగర కార్యదర్శి శ్రీరాములు అధ్యక్షతన వెంగమనాయుడు 27వ వర్ధంతిని నిర్వహించారు. జగదీష్, సీనియర్ నేతలు రవీంద్రనాథ్, జిల్లా కార్యదర్శి జాఫర్, ఇతర నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జగదీష్ మాట్లాడుతూ వెంగమనాయుడు భూదాన ఉద్యమంలో, వ్యవసాయ కూలీలకు రేట్లు పెంచేందులకు అనేక ఆందోళన కార్యక్రమాల్లో స్ఫూర్తిదాయక ఉద్యమాలు చేశారన్నారు. 22 ఏళ్ల పాటు ఉమ్మడి అనంతపురం జిల్లా సీపీఐ కార్యదర్శిగా పనిచేసి గ్రామాల్లో అనేక శాఖలు ఏర్పాటుచేయించారన్నారు. జాఫర్ మాట్లాడుతూ.... నిర్బంధాలకు సైతం ఎదురొడ్డి పార్టీ కార్యకర్తలకు ధైర్యాన్ని అందించారన్నారు. ఆ పార్టీ నాయకులు ఝాన్సీ, వెంగమ నాయుడి తనయుడు అజయ్‌కుమార్, ఈశ్వర్‌రెడ్డి, లింగమయ్య, రమణయ్య, సంతో్‌షకుమార్, కుళ్లాయిస్వామి, రమణ, అల్లిపీరా, రమేష్, నారాయణస్వామి, సుందర్రాజు, గాదిలింగప్ప, మున్న, రాజు, నాగప్ప పాల్గొన్నారు.