Share News

CPM: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి

ABN , Publish Date - Oct 03 , 2024 | 11:49 PM

విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణను ఆపాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గురువారం డిప్యూటీ తహసీల్దార్‌ రెడ్డిశేఖర్‌కు వినతిపత్రం అందించారు.

CPM: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి
CPM leaders petitioning DT

సోమందేపల్లి, అక్టోబరు 3: విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణను ఆపాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గురువారం డిప్యూటీ తహసీల్దార్‌ రెడ్డిశేఖర్‌కు వినతిపత్రం అందించారు. సీపీఎం నాయకుడు పెద్దన్న మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నారు. ఎంతో మంది ప్రాణత్యాగాల ప్రతిఫలం పరిశ్రమ అన్నారు. పరిశ్రమను కేంద్రం ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నించడం సమంజసంకాదన్నారు. లక్షల మంది పరిశ్రమద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారన్నారు. కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. నాయకులు బెస్త కిష్టప్ప, రామక్రిష్ణ పాల్గొన్నారు.

పెనుకొండ: ఎన్నోపోరాటాల ఫలితంగా ఆంధ్రులు సాధించుకున్న విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణ మానుకోవాలని రైతు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. గురువారం ఆ సం ఘం నాయకుడు హరి, గంగాధర్‌, బాబావలి స్థానిక తహసీల్దార్‌ కా ర్యాలయం వద్ద నిరసన తెలిపారు. వారు నాయకులు మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమద్వారా లక్షలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనోపాది పొందుతున్నారన్నారు. పరిశ్రమ ప్రైవేటీకరిస్తే లక్షలాది మంది ఉపాధిలేకుండా రోడ్డున పడే పరిస్థితి వస్తుందన్నారు.

Updated Date - Oct 03 , 2024 | 11:49 PM