Share News

COLLECTOR : ఫెసిలిటేషన సెంటర్లలోనే ఓటు వేయాలి

ABN , Publish Date - Apr 24 , 2024 | 12:38 AM

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటర్లు ఫెసిలిటేషన సెంటర్లలోనే ఓటు వేయాల్సి ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ అన్నారు. కలెక్టరేట్‌ రెవెన్యూ భవనలో నగరపాలిక కమిషనర్‌ మేఘస్వరూప్‌, పోస్టల్‌ బ్యాలెట్‌ నోడల్‌ ఆఫీసర్‌, డీపీఓ ప్రభాకరరావుతో కలిసి మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎన్నికల పక్రియలో పోస్టల్‌ బ్యాలెట్‌ కీలకమైనదని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పిస్తామని అన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వేయకపోతే ఉద్యోగులకు అవగాహన లేదని, సౌకర్యాలు కల్పించలేదనే అపోహాలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. అర్హులందరూ పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకోవాలని సూచించారు. గతంలో ...

COLLECTOR : ఫెసిలిటేషన సెంటర్లలోనే ఓటు వేయాలి
Collector Vinod Kumar speaking at a press conference

హౌస్‌ ఓటింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నాం

జిల్లా ఎన్నికల అధికారి వినోద్‌కుమార్‌

అనంతపురం టౌన, ఏప్రిల్‌ 23: పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటర్లు ఫెసిలిటేషన సెంటర్లలోనే ఓటు వేయాల్సి ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ అన్నారు. కలెక్టరేట్‌ రెవెన్యూ భవనలో నగరపాలిక కమిషనర్‌ మేఘస్వరూప్‌, పోస్టల్‌ బ్యాలెట్‌ నోడల్‌ ఆఫీసర్‌, డీపీఓ ప్రభాకరరావుతో కలిసి మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎన్నికల పక్రియలో పోస్టల్‌ బ్యాలెట్‌ కీలకమైనదని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పిస్తామని అన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వేయకపోతే ఉద్యోగులకు అవగాహన లేదని, సౌకర్యాలు కల్పించలేదనే అపోహాలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. అర్హులందరూ పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకోవాలని సూచించారు.


గతంలో దరఖాస్తు చేసుకున్నవారికి పోస్టల్‌ ద్వారా వారి ఇళ్లకు బ్యాలెట్‌ పంపించేవారని, ఆ తరువాత ఓటు వేసి అధికారులు ఏర్పాటు చేసిన కౌంటర్లలో అందించేవారని అన్నారు. ఈ సారి పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్నవారు ఓటు వినియోగించుకునేందుకు ప్రత్యేక షెడ్యూల్‌ ఇస్తామని, ఆయా తేదీలలో ఫెసిలిటీ సెంటర్లను ఏర్పాటు చేసి పోలింగ్‌ నిర్వహిస్తామని అన్నారు. జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలలో ఒక్కో ఫెసిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మే 3 నుంచి 6వ తేదీ వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ నిర్వహిస్తామని తెలిపారు. హోం ఓటింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. జిల్లాలో హోం ఓటింగ్‌కు అర్హులైన వృద్ధులు 988 మంది, దివ్యాంగులు 26,097 మంది ఉన్నారని, కానీ వీరిలో 1,304 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వీరికి మే 5 నుంచి 9వ తేదీ వరకు పోలింగ్‌ నిర్వహణకు 38 బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు.

మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 24 , 2024 | 12:39 AM