Share News

WATER RELASE: సింగప్పకుంటకు నీటి విడుదల

ABN , Publish Date - Dec 15 , 2024 | 12:31 AM

పులివెందుల బ్రాంచ కెనాల్‌కు ఎగువ భాగంలో ఉన్న దేశాయి సింగప్పకుంటకు ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని శనివారం మధ్యాహ్నం విడుదల చేశారు.

WATER RELASE: సింగప్పకుంటకు నీటి విడుదల
Leaders releasing water

తాడిమర్రి, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): పులివెందుల బ్రాంచ కెనాల్‌కు ఎగువ భాగంలో ఉన్న దేశాయి సింగప్పకుంటకు ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని శనివారం మధ్యాహ్నం విడుదల చేశారు. గ్రామానికి చెందిన కొందరు రైతులు ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇనచార్జ్‌ పరిటాలశ్రీరామ్‌ను కలిసి తమకు నీటిని తరలించేందుకు మోటార్లు, పైపులు ఇవ్వాలని 10 రోజుల క్రితం కోరగా స్పందించిన ఆయన వెంటనే పనులు ప్రారంభించి శనివారం నుంచి నీటిని విడుదల చేయించారు. పులివెందుల బ్రాంచ కెనాల్‌లో వెళ్తున్న నీటిని ఒక కిలోమీటరు మేర పైపులైన ఏర్పాటుచేసి నీటిని తరలించే పని మొదలు పెట్టారు. గ్రామ రైతులతో కలిసి టీడీపీ మండల కన్వీనర్‌ కూచిరామ్మోహన ప్రారంభించారు. సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు గోనుగుంట్ల భూషణ్‌, టీఎనటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు హర్షవర్దన, రైతులు శ్రీనివాసరెడ్డి, పక్కీర్‌రెడ్డి, రాము, భాస్కర్‌గౌడ్‌, శివంపల్లిరంగయ్య, శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Dec 15 , 2024 | 12:31 AM