MLA KANDIKUNTA : ఇళ్ల వద్దే పింఛన్లు అందిస్తున్నాం : ఎమ్మెల్యే కందికుంట
ABN , Publish Date - Sep 01 , 2024 | 12:14 AM
అధికారులు, నాయకులు సమష్టిగా లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి పింఛన అందిస్తున్నాని ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ పేర్కొన్నారు. సెప్టెంబరు ఒకటో తేదీ ఆదివారం కావడంతో ప్రతినెల ఒకటో తేదీన పంపిణీ చేయాల్సిన పింఛన్లను శనివారం 31వ తేదీనే పంపిణీ చే శారు. మండలంకేంద్రంలోని పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పాల్గొన్నారు.
నంబులపూలకుంట, ఆగస్టు 31: అధికారులు, నాయకులు సమష్టిగా లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి పింఛన అందిస్తున్నాని ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ పేర్కొన్నారు. సెప్టెంబరు ఒకటో తేదీ ఆదివారం కావడంతో ప్రతినెల ఒకటో తేదీన పంపిణీ చేయాల్సిన పింఛన్లను శనివారం 31వ తేదీనే పంపిణీ చే శారు. మండలంకేంద్రంలోని పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పాల్గొన్నారు. ఆయన లబ్ధిదారుల ఇళ్లవద్దకెళ్లి పింఛన్లు అందిం చారు. అనంతరం పీర్లచావిడి వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మా ట్లాడుతూ... సమాజం, వ్యవస్థ, నాయకుల మీద గౌరవమున్న వ్యక్తి ముఖ్యమంత్రి అయితే పరిపాలన ఏవిధంగా ఉంటుందో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చూ పుతున్నారని అన్నారు.
మండ లంలో నెలకున్న సమస్యలను రెండు, మూడు నెల ల్లో పరిష్కరిస్తా మన్నారు. శ్మశానవాటికకు ఉపాధి పథకం నిధులు మంజూరు చేయిస్తామన్నారు. సోలార్‌లో భూములు కోల్పోయి నేటికీ పరిహారం అందని రైతుల త్వరలో సమస్యను పరిష్కరిస్తామన్నారు. త్వరలో కొత్త పింఛన్లు మంజూరు చేస్తామ న్నారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎంపీడీఓ మనోహర్ బాబు, తహసీల్దార్ నరేంద్రకుమార్, పంచాయతీ కార్యదర్శి రమేష్‌నాయుడు, ఏపీఓ చంద్రశేఖర్, సర్పంచ ఆంజనమ్మ, దండే రవి, శివారెడ్డి, గంగిరెడ్డి, ఆంజనప్పనాయుడు, నరసింహులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....