Share News

MLA SUNITHA: ప్రతి హామీని నెరవేరుస్తాం

ABN , Publish Date - Aug 01 , 2024 | 11:51 PM

ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. గురువారం వెంకటాపురం గ్రామంలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లను ఉపాధి హామీ కూలీల వద్దకు ఉదయం 6గంటలకే వెళ్లి పంపిణీచేశారు.

MLA SUNITHA: ప్రతి హామీని నెరవేరుస్తాం
MLA giving pension to beneficiaries

రామగిరి, ఆగస్టు 1: ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. గురువారం వెంకటాపురం గ్రామంలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లను ఉపాధి హామీ కూలీల వద్దకు ఉదయం 6గంటలకే వెళ్లి పంపిణీచేశారు. అనందరం ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఆమె మాట్లాడుతూ ఆర్టీసీ బస్సుల్లో త్వరలోనే మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందని, రాప్తాడు నియోజకవర్గం రెండు జిల్లాల పరిధిలో ఉన్నందున మహిళలు తిరిగేందుకు అనుమతి ఇవ్వాలని సీఎం చంద్రబాబు దృష్టికితీసుకెళ్తామన్నారు. ఎంపీడీఓ రాధాకృష్ణ, ఏఓ వెంకటేశ్వరప్రసాద్‌, మండల కన్వీనర్‌సుధాకర్‌, సిబ్బంది శివ, టీడీపీ నాయకుడు సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

ఇచ్చిన మాట తప్పేదేలేదు

- ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌

అనంతపురం అర్బన: ఇచ్చిన మాట తప్పేదేలేదని... ప్రతినెలా 1వతేదీనే ఉదయం 6 గంటలకే తలుపుతట్టి పింఛన్లు అందజేస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ అన్నారు. గురువారం నగరంలోని పలు డివిజన్లలో జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్‌, స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి అర్హులైన పింఛనదారులకు పింఛన సొమ్మును అందజేశారు. ముందుగా స్థానిక శ్రీనగర్‌ కాలనీలోని టీడీపీ అర్బన కార్యాలయంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అరవిందనగర్‌లోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పింఛన్ల పంపిణీని ప్రారంభించారు. అరవింద్‌నగర్‌, ఆదర్శనగర్‌, హమాలీ కాలనీ, హౌసింగ్‌ బోర్డు కాలనీ, బుడ్డప్ప నగర్‌, సంగమేశ్వర నగర్‌, డీసీఎంఎస్‌ రోడ్డు ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే హాజరయ్యారు. మాజీ మేయర్‌ స్వరూప, నాయకులు తలారి ఆదినారాయణ, బుగ్గయ్య చౌదరి, సరిపూటి రమణ, బల్లా పల్లవి, పీఎం లక్ష్మీప్రసాద్‌, కూచి హరి, నెట్టెం బాలకృష్ణ, లక్ష్మీనరసింహ, కురబ నారాయణస్వామి పాల్గొన్నారు.


పేద ప్రజల ఆనందమే ప్రభుత్వానికి దీవెనలు

- ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ

బుక్కరాయసముద్రం/శింగనమల/నార్పల: రాష్ట్రంలో ఎన్టీఆర్‌ భరోసా పిం ఛన్ల పంపిణీ పండుగతో పేద ప్రజల మోములో చిరునవ్వలే కూటమి ప్రభుత్వానికి దీవెనలు అని ఎమ్మెల్యే బండారు శ్రావణీశ్రీ అన్నారు. గురువారం రేకలకుంట గ్రామంలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్‌, ద్విసభ్యకమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి, అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్‌బాబు, మార్కెట్‌ మాజీ వైస్‌ చైర్మన పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. మాజీ సర్పంచ ఆదిశేషు, జీసీ బాబు, నరేంద్రయాదవ్‌, సురే్‌షచౌదరి, సుధాకర్‌ పాల్గొన్నారు. అలాగే నార్పల మండలం నడిమిదొడ్డిలో స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలం వెంకటనరసానాయుడు, శ్రీధార్‌ బాబు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. శింగనమల మండలం సి.బండమీదపల్లిలో ఎమ్మెల్యే లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. స్పెషల్‌ ఆఫీసర్లు ప్రభాకర్‌రావు, చంద్రశేఖర్‌, ఎంపీడీఓ వెంకటరమణ పాల్గొన్నారు.

Updated Date - Aug 01 , 2024 | 11:51 PM