Share News

PLUMBERS: రాజకీయాలకు అతీతంగానే పట్టాలు సాధించుకున్నాం

ABN , Publish Date - Oct 09 , 2024 | 12:02 AM

పొట్టకూటి కోసం రేయింబవళ్లు కష్టపడి పనిచేసే ప్లంబర్‌ వృత్తిమాది... అయితే కొందరు వ్యక్తులు కోర్టుకు వెళ్లడంతో 2022లో ప్లంబర్స్‌ అసోసియేషనకు ఆ భూమిని కేటాయిస్తూ కోర్టు తీర్పనివ్వడంతో ప్రభుత్వ పెద్దల సహకారంతో ఉన్నభూమిని పంచుకున్నామని ఆ సంఘం ఉపాధ్యక్షుడు సురేంద్రబాబు పేర్కొన్నారు.

PLUMBERS: రాజకీయాలకు అతీతంగానే పట్టాలు సాధించుకున్నాం
Surendra, the Vice President of the Plumbers Association, is speaking

ధర్మవరం, అక్టోబరు 8: పొట్టకూటి కోసం రేయింబవళ్లు కష్టపడి పనిచేసే ప్లంబర్‌ వృత్తిమాది... అయితే కొందరు వ్యక్తులు కోర్టుకు వెళ్లడంతో 2022లో ప్లంబర్స్‌ అసోసియేషనకు ఆ భూమిని కేటాయిస్తూ కోర్టు తీర్పనివ్వడంతో ప్రభుత్వ పెద్దల సహకారంతో ఉన్నభూమిని పంచుకున్నామని ఆ సంఘం ఉపాధ్యక్షుడు సురేంద్రబాబు పేర్కొన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలోని 650-2 సర్వే నంబర్‌లో 20 సంవత్సరాల క్రితం ప్లంబర్స్‌ అసోసియేషనకు ప్రభుత్వం స్థలం కేటాయించిందన్నారు. కొందరు వ్యక్తులు కోర్టుకు వెళ్లడంతో అప్పటి నుంచి పెండింగ్‌ పడుతూ 2022లో హైకోర్టు అనుకూలంగా తీర్పునిచ్చిందన్నారు. తీర్పు అనంతరం అప్పటి ఆర్డీఓ ప్రతిపాదలకు అసోసియేషనను పిలిపించి రాజీచేసి కలిసి ముందుకు వెళ్లాలని సూచించడంతో అందుకు సమ్మతించామన్నారు. మొదట్లో 53 మందికి పట్టాలు ఇవ్వగా ఒక్కొక్కరికి రెండున్నర నుంచి 3 సెంట్ల వరకు కేటాయించామన్నారు. ఈ 20 ఏళ్లలో ఆ భూమిని కొందరు కబ్జాచేయగా మిగిలిన 1.34 ఎకరాల్లో ఒక్కొక్కరికి 1.25 సెంట్ల చొప్పున పంచగా ప్లంబర్స్‌లోని కొందరు ముఖ్యులు 20 ఏళ్ల నుంచి కోర్టు ఖర్చులు భరించడంతో వారికి మాత్రం రెండుపట్టాలు చొప్పున ఇచ్చామన్నారు. సాధారణంగా ఎవరైనా సమస్యలు పరిష్కరించుకోవాలంటే అధికార పార్టీ నాయకులను సంప్రదిస్తారన్నారు. అందులోభాగంగానే టీడీపీ, వైసీపీ నాయకులను కలిసిన్యాయం చేయాలని కోరామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా న్యాయఅన్యాయాలను విచారించి తగిన నిర్ణయం తీసుకోవాలని ఆ యన కోరారు. కార్యదర్శి రాజు, జాయింట్‌ సెక్రటరీ లదీప్‌, కోశాధికారి ఇ స్మాయిల్‌, జుబేర్‌, సభ్యులు జాహీద్‌, చంద్ర, వీరారెడ్డి, అంజి, కిష్ట, మాధవ, జిలాన, బాషా, హసీమ్‌, అనిల్‌కుమార్‌, అజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 09 , 2024 | 12:02 AM