Share News

MLA SUNITA : ఐదేళ్లు అరాచక పాలన చూశాం

ABN , Publish Date - Sep 21 , 2024 | 12:25 AM

ఐదేళ్ల పాటూ అరాచక పాలన చూసి విసుగు చెందాం, రానున్న ఐదేళ్లు సుపరిపాలన చూస్తారని ఎమ్మెల్యే పరి టాల సునీత తెలిపారు. ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పలు గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ముం దుగా ముత్తవ కుంట్లలో భూమిపూజ చేసి సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. అనంత రం బాలేపాళ్యం, కనగానపల్లి, తూంచెర్ల, తగరకుంట, వేపకుంట, మద్దెల చెరువు గ్రామాల్లో రూ. 3.60 కోట్లతో సీసీ రోడ్లు నిర్మాణానికి భూమి పూజ చేశారు.

MLA SUNITA : ఐదేళ్లు అరాచక పాలన చూశాం
MLA Paritala Sunitha inaugurating a plaque in Thooncherla

ఇక సుపరిపాలనే.. : ఎమ్మెల్యే పరిటాల సునీత

కనగానపల్లి, సెప్టెంబరు 20: ఐదేళ్ల పాటూ అరాచక పాలన చూసి విసుగు చెందాం, రానున్న ఐదేళ్లు సుపరిపాలన చూస్తారని ఎమ్మెల్యే పరి టాల సునీత తెలిపారు. ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పలు గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ముం దుగా ముత్తవ కుంట్లలో భూమిపూజ చేసి సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. అనంత రం బాలేపాళ్యం, కనగానపల్లి, తూంచెర్ల, తగరకుంట, వేపకుంట, మద్దెల చెరువు గ్రామాల్లో రూ. 3.60 కోట్లతో సీసీ రోడ్లు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా కనగానపల్లిలో రైతు సురేష్‌ పొలంలో ఉపాధి హామీ పథకం ద్వారా పండ్ల మొక్కల పెంపకంలో భాగంగా మామిడి మొ క్కలు నాటారు. ఆయా గ్రామాల్లో గ్రామ స్వచ్ఛతాహి సేవ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు ‘ఇది మంచి ప్రభుత్వం’ స్టిక్కర్లను ఇంటింటికీ వెళ్లి అతికించారు.


ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విపత్కర పరిస్థితు ల్లో సీఎం చంద్రబాబు ప్రజలకు మంచి పాలన అందిస్తున్నారన్నారు. నియోజకవర్గంలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 26 కోట్లు పనులకు శ్రీకారం చుట్టామన్నారు. రానున్న కాలంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతా మని, ఎన్నికల హామీలు నెరవేరుస్తామన్నారు. గత టీడీపీ హయాంలో రూ. 5 కోట్ల ఈఏపీ నిధులతో మంజూరైన రంగంపేట, సీఎనకోట, తూం చెర్ల, తగరకుంట రోడ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. కార్యక్ర మంలో ఈఓఆర్డీ అనిల్‌కుమార్‌, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నెట్టెం వెంకటేష్‌, మండల కన్వీనర్‌ యాతం పోతులయ్య, నాయకులు సుధాకర్‌చౌదరి, ముకుంద నాయుడు, బిల్లే బాస్కర్‌, బట్టా సురేష్‌ చౌదరి, సర్పంచులు అంజి, సోమర చంద్రశేఖర్‌, రామకృష్ణ, మాధవ, రామాంజి తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 21 , 2024 | 12:25 AM