Share News

MLA SUNITA ; మేము చేసిందే చెబుతున్నాం

ABN , Publish Date - Sep 27 , 2024 | 12:22 AM

తాము వంద రోజుల పాలనలో ఏం చేశామో అదే చెబుతున్నామని, అందుకే దైర్యంగా ప్రజల వద్దకు వెళ్తున్నా మని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. అంతే దైర్యంతో వైసీపీ నాయ కులు ప్రజల్లోకి వెళ్లగలరా...? అని ప్రశ్నించారు. మండల కేంద్రంలోని రామ గిరిలో గురువారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా టీడీపీ నాయకులతో కలిసి ఆమె పర్యటించారు. వందరోజుల్లో చేపట్టిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.

MLA SUNITA ; మేము చేసిందే చెబుతున్నాం
MLA Sunitha and TDP leaders distributing pamphlets from house to house

ఎమ్మెల్యే పరిటాల సునీత

రామగిరి, సెప్టెంబరు 26: తాము వంద రోజుల పాలనలో ఏం చేశామో అదే చెబుతున్నామని, అందుకే దైర్యంగా ప్రజల వద్దకు వెళ్తున్నా మని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. అంతే దైర్యంతో వైసీపీ నాయ కులు ప్రజల్లోకి వెళ్లగలరా...? అని ప్రశ్నించారు. మండల కేంద్రంలోని రామ గిరిలో గురువారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా టీడీపీ నాయకులతో కలిసి ఆమె పర్యటించారు. వందరోజుల్లో చేపట్టిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నియోజవర్గంలో అభివృద్ధి అనేది ఐదేళ్ల క్రితం చూ శారని, ఆ తరువాత తమ వంద రోజుల పాలనలో చూస్తున్నారన్నారు. గ త ఐదేళ్లలో చిన్న రోడ్డు వేయాలంటే స్పందించే వారు లేరని, అదే తమ ప్ర భుత్వం వచ్చాక సీసీ రోడ్లకే రూ.25కోట్ల నిధులు విడుదల చేశారన్నారు. టీడీపీ సానుభూతి పరులని చాలా మందికి అర్హత ఉన్నా సంక్షేమ పథకాలు అందకుండా చేశారని, ఈ ప్రభుత్వంలో అర్హతఉంటే అన్ని పథ కాలు అందుతాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అనుభవంతో సమర్థవంతంగా రాష్ట్రాన్ని నడుపుతుంటే వైసీపీ నాయకులు అడ్డుతగులుతూ అనేక కుట్రలకు పాల్పడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వెంట స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.


చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి

విద్యార్థులు చదువుతోపాటు క్రీడలు చాలా అవసరమని ఎమ్మెల్యే పరిటాలసునీత పేర్కొన్నారు. రామగిరిలో గురువారం పరిటాలరవీంద్ర మెమోరియల్‌ క్రీడామైదానంలో జరుగుతున్న 68వ స్కూల్‌ గేమ్స్‌ నియోజకవర్గ స్థాయి అండర్‌ -14,17 క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకున్నా రు. క్రీడాకారుల కోసం పరిటాల ర వీంద్ర పేరుమీద క్రీడామైదానం నిర్మి స్తే వైసీపీ హయాంలో సరైన పర్యవేక్షణ లేక అధ్వానంగా మార్చారన్నారు. ఈ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని, ఇక్కడ ఏ అవసమున్న తన దృష్టికి తీసుకురావాల న్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 27 , 2024 | 12:22 AM