Share News

MLA SUNITA : మౌనగిరిని పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం

ABN , Publish Date - Nov 25 , 2024 | 12:16 AM

మండలంలోని హంపాపురం సమీపం లో ఉన్న మౌనగిరి హనుమన క్షేత్రాన్ని పర్యాటకంగా అభివృద్ది చేస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత, టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ తెలిపారు. మౌనగిరి క్షేత్రం ఏడో వార్షికోత్సవం సందర్బంగా పరిటాల కుటుంబ సభ్యులు అక్కడి ఏకశిలా ఆంజనేయస్వామి విగ్రహాన్ని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే పరిటాల సునీతతో పాటూ పరిటాల శ్రీరామ్‌, పరిటాల జ్ఞాన దంపతులు స్వామి వారికి పట్టు వసా్త్రలు సమర్పించారు.

MLA SUNITA : మౌనగిరిని పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం
The couple of MLA Paritala Sunitha and Paritala Sriram participated in the pujas

ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్‌

రాప్తాడు, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): మండలంలోని హంపాపురం సమీపం లో ఉన్న మౌనగిరి హనుమన క్షేత్రాన్ని పర్యాటకంగా అభివృద్ది చేస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత, టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ తెలిపారు. మౌనగిరి క్షేత్రం ఏడో వార్షికోత్సవం సందర్బంగా పరిటాల కుటుంబ సభ్యులు అక్కడి ఏకశిలా ఆంజనేయస్వామి విగ్రహాన్ని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే పరిటాల సునీతతో పాటూ పరిటాల శ్రీరామ్‌, పరిటాల జ్ఞాన దంపతులు స్వామి వారికి పట్టు వసా్త్రలు సమర్పించారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పరిసరాల ను మౌనగిరి వ్యవస్థాప కులు ఈశ్వరయ్యతో కలిసి పరిశీలించారు. జాతీయ రహ దారి వద్ద నుంచి ఆలయం వరకు రోడ్డు నిర్మిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. టీడీపీ మండల ఇనచార్జ్‌ ధర్మవరపు మురళి, మండల కన్వీనర్‌ కొండప్ప, హం పాపురం జయప్ప, మరూరు గోపాల్‌, పుల్లలరేవు ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

అనంతపురంరూరల్‌, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): పేద ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం ఎంత ఖర్చు చేసేందుకైనా సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. అనంతపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆమె ఆదివారం నియోజకవర్గంలోని 15మందికి రూ.11.10 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు ఆమె పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ...పార్టీలతో సంబంధం లేకుండా ఇలాంటి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తున్నారని తెలిపారు.

వరిధాన్యానికి పూజలు చేసిన పరిటాలసునీత

రామగిరి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యేపరిటాలసునీత సొంత వ్యవసా య క్షేత్రంలో పండిన వరిపంటను కోతకోశారు. ఆమె ఆదివారం ఆ ధాన్యాన్ని రాసికట్టించి పూజలుచేశారు. అనంతరం వాటిని సంచులకు నింపి మిల్లుకు తరలించారు. ఈ ఏడాది వరిపంట ఆశాజనకంగా ఉండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఆమెతెలిపారు. సకాలంలో వర్షాలు రావడం వ్యాధులు తక్కువగా ఉండటంతో పంట దిగుబడి బాగా వచ్చిందన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Nov 25 , 2024 | 12:16 AM