Share News

MLA DAGGUPATI: వైసీపీ హయాంలో అవినీతిని బయటకు తీస్తాం

ABN , Publish Date - Jul 18 , 2024 | 11:51 PM

అనంతపురం అర్బనలో వైసీపీ ఐదేళ్ల పాలనలో జరిగిన అవినీతిని బయటకు తీస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ స్పష్టం చేశారు. అవినీతి, అక్రమాలపై జాయింట్‌ కలెక్టర్‌తో విచారణ చేయించి, తగు చర్యలు తీసుకుంటామన్నారు. గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ను కలిసి వైసీపీ ఐదేళ్ల పాలనలో అనంత అర్బనలో జరిగిన అవినీతి, అక్రమాలపై ఆయన ఫిర్యాదు చేశారు.

MLA DAGGUPATI: వైసీపీ హయాంలో అవినీతిని బయటకు తీస్తాం
MLA coming out after meet with collector

అనంతపురం టౌన/అర్బన, జూలై 18: అనంతపురం అర్బనలో వైసీపీ ఐదేళ్ల పాలనలో జరిగిన అవినీతిని బయటకు తీస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ స్పష్టం చేశారు. అవినీతి, అక్రమాలపై జాయింట్‌ కలెక్టర్‌తో విచారణ చేయించి, తగు చర్యలు తీసుకుంటామన్నారు. గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ను కలిసి వైసీపీ ఐదేళ్ల పాలనలో అనంత అర్బనలో జరిగిన అవినీతి, అక్రమాలపై ఆయన ఫిర్యాదు చేశారు. 50 సెంట్ల భూమి విషయంలో వివాదంతో ఎన్డీఆర్‌మార్గ్‌ రోడ్డు నిరుపయోగంగా మారిందని కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. ఇందుకు సంబంధించిన భూమి యజమానులకు పరిహారం అందించి రోడ్డును పూర్తి చేయడం ద్వారా నగరంలో ట్రాఫిక్‌ సమస్య తగ్గుతుందని వివరించారు. వైసీపీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. 7 ఎకరాల్లో ఉండాల్సిన సెంట్రల్‌ పార్క్‌ ప్రస్తుతం మూడున్నర ఎకరాల్లో మాత్రమే ఉందన్నారు. మిగతా భూమిని వైసీపీ నాయకులు కబ్జా చేశారని, వెంటనే ఆక్రమణలను తొలగించాలని కోరారు. ఇటీవల జరిగిన నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశంలో వైసీపీ నాయకులు చేసిన అరోపణలపై విచారణ చేయించాలన్నారు. ఇందుకు కలెక్టర్‌ స్పందిస్తూ.. జాయింట్‌ కలెక్టర్‌ తో విచారణ చేయించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ ఐదేళ్ల పాలనలో జరిగిన అవినీతిని వెలికితీస్తామన్నారు. త్వరలో ఎన్టీఆర్‌ మార్గ్‌లో వాహనాల రాకపోకలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.


గాయపడిన టీడీపీ నాయకుడికి పరామర్శ: నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీడీపీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు వీరాంజనేయులును ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ పరామర్శించారు. గురువారం రాత్రి స్థానిక బళ్లారి రోడ్డులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను ఎమ్మెల్యే పరామర్శించారు. మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులకు ఎమ్మెల్యే సూచించారు.

Updated Date - Jul 18 , 2024 | 11:51 PM