BOJJA DASARATHARAMI REDDY : సీమ నీటిపై మీ విధానం ఏమిటి..?
ABN , Publish Date - Apr 24 , 2024 | 12:43 AM
రాయలసీమ నీటి ప్రాజెక్టులపై రాజకీయ పార్టీలు తమ విధానాలను ప్రకటించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి, జలసాధన సమితి అధ్యక్షుడు రామ్‌కుమార్, ఓపీడీఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. వజ్రకరూరు మండలం రాగులపాడు సమీపంలోని హంద్రీనీవా పంప్‌హౌస్ వద్ద కాలువను మంగళవారం వారు సందర్శించారు. అనంతరం గుంతకల్లు పట్టణంలోని సీపీఐ ఎంఎల్ న్యూడెమోకస్రీ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు
సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా
గుంతకల్లు టౌన, ఏప్రిల్ 23: రాయలసీమ నీటి ప్రాజెక్టులపై రాజకీయ పార్టీలు తమ విధానాలను ప్రకటించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి, జలసాధన సమితి అధ్యక్షుడు రామ్‌కుమార్, ఓపీడీఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. వజ్రకరూరు మండలం రాగులపాడు సమీపంలోని హంద్రీనీవా పంప్‌హౌస్ వద్ద కాలువను మంగళవారం వారు సందర్శించారు. అనంతరం గుంతకల్లు పట్టణంలోని సీపీఐ ఎంఎల్ న్యూడెమోకస్రీ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. హంద్రీనీవా ప్రాజెక్టు ప్రారంభించి 35 ఏళ్లు గడిచినా.. నేటికీ పూర్తి కాలేదని అన్నారు.
రాయలసీమలోని 6,02,500 ఎకరాలకు నీటిని అందించే విధంగా హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తిస్థాయిలో రీ డిజైన చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాన కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 10 వేల క్యూసెక్కులకు పెంచి.. ఆ నీటిని నిల్వ చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులను వెంటనే చేపట్టి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పీఏబీఆర్‌లో 11 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు భూసేకరణ చేపట్టాలని కోరారు. రిజర్వాయర్ సామరర్థ్యాన్ని, భద్రతను మెరుగుపరచాలని అన్నారు. హెచ్చెల్సీకి అనుసంధానంగా ఉంతకల్లు వద్ద 10 టీఎంసీల రిజర్వాయర్, పెరవలి వద్ద మరో రిజర్వాయర్‌ను నిర్మించాలని డిమాండ్ చేశారు. నీటి వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన కొత్త ట్రిబ్యునల్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఐఎ్‌ఫటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్, డివిజన కమిటీ కార్యదర్శి చిన్న, జలసాధన సమితి నాయకులు నాగరాజు, ఏసురత్నం, పెద్దన్న తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....