Share News

MLA KANDIKUNTA: ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తా

ABN , Publish Date - Oct 07 , 2024 | 11:35 PM

దిరి నియోజకవర్గాన్ని ఆదర్శనియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ అన్నారు.

MLA KANDIKUNTA: ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తా
MLA Kandikunta is leading JCB and starting road works

తనకల్లు, అక్టోబరు 7: కదిరి నియోజకవర్గాన్ని ఆదర్శనియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ అన్నారు. మండలంలోని గద్దలబండతండానుంచి ఎర్రగుట్టపల్లి వరకు రోడ్డు నిర్మాణానికి సోమవారం ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో గిరిజనులకు ఇచ్చిన హామీమేరకు గద్దలబండతండా, గేమేనాయక్‌తండా తదితర తండా గ్రామాలకు వెళ్లేందుకు రోడ్డు నిర్మాణానికి రూ.2.50కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. ఇచ్చిన హామీకి కట్టబడి వందరోజుల్లోనే అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. గిరిజన, దళితవాడల్లో శ్మశానవాటికలు ఏర్పాటు చేయడానికి ఇప్పటికే కార్యాచరణ ప్రారంభమైందన్నారు. రూ.2.50కోట్ల నిధులు సరిపోకపోతే, మరిన్ని తీసుకువచ్చి పూర్తిస్థాయిలో ఎర్రగుట్టపల్లి వరకు రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన మూడునెలల్లోనే ఒక్కొక్కమండలానికి ఉపాధి పథకం ద్వారా రూ.3 కోట్ల నిధులు మంజూరు చేయించామన్నారు. కూటమి కుటుంబ సభ్యులను తన కుటుంబ సభ్యులాగా చూసుకుంటామన్నారు. సర్పంచ కాంతమ్మ, టీడీపీ ఈశ్వర్‌రెడ్డి, శంకర్‌నాయుడు, రాజారెడ్డి, కన్వీనర్‌ రెడ్డిశేఖర్‌రెడ్డి, శ్రీరాములనాయక్‌, ఉత్తన్ననాయక్‌, తెలుగుయువత ప్రవీణ్‌, బ్రహ్మనందరెడ్డి, హరినాయక్‌, ఆనంద్‌రెడ్డి, మల్లిరెడ్డి, మహబూబ్‌బాషా, దస్తగిరి, తహసీల్దార్‌ శోభాసువర్ణమ్మ, ఎంపీడీఓ వెంకటరమణ, ఏపీఓ మరియమ్మ, ఏపీఎం జయంతి పాల్గొన్నారు.

మృతుడి కుటుంబానికి పరామర్శ: మండలంలోని సింగిరివాండ్లపల్లి గ్రామంలో మూడురోజులక్రితం టీడీపీ కార్యకర్త నాగరాజు మృతిచెందారు. విషయం తెలుసుకుని ఎమ్మెల్యే కందికుంట సోమవారం ఆ గ్రామానికెళ్లి నాగరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. మృతుని కుటుంబాన్ని పరామర్శించారు.

Updated Date - Oct 07 , 2024 | 11:35 PM