MLA : రైతుల సమస్యల పరిష్కారం దిశగా కృషి
ABN , Publish Date - Dec 16 , 2024 | 12:33 AM
కూటమి ప్రభుత్వం రైతుల సమస్య పరిష్కార దిశగా ముందుకెళుతోందని, సాగునీటి సంఘాల కమిటీలు బాధ్యతగా పనిచేయాలని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ సూచించారు.
ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ
శింగనమల, డిసెంబరు15 (ఆంధ్రజ్యోతి) : కూటమి ప్రభుత్వం రైతుల సమస్య పరిష్కార దిశగా ముందుకెళుతోందని, సాగునీటి సంఘాల కమిటీలు బాధ్యతగా పనిచేయాలని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ సూచించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన తరిమెల ఆయ కట్టు కమిటీ అధ్యక్షుడు కుమ్మెత చండ్రాయుడు, ఉపాధ్యక్షుడు దండు లక్ష్మీ నారాయణ, సభ్యులు ఆదివారం తెలుగుయవత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులతో కలిసి అనంతపురంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేని కలసి కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు గుత్తా ఆదినారాయణ, పెద్ది రెడ్డి విశ్వనాథ్‌రెడ్డి, సుధీర్, రామకృష్ణ, కుళ్లాయప్ప తదితరులు పాల్గొన్నారు.
ఆందోళన చెందకండి.. ప్రభుత్వం అండగా ఉంటుంది
గార్లదిన్నె, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఎవరు ఎలాంటి ఆందోళన చెంద కండి...మీకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది అని మృతుల కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ భరోసా ఇచ్చారు. గార్లదిన్నె మండలం తలగాసిపల్లి జంక్షన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఎల్లుట్ల గ్రామానికి చెందిన కూలీల కుటుంబ సభ్యలతో ఎమ్మెల్యే మాట్లాడారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో వారితో ఎమ్మెల్యే మాట్లాడుతూ... బాధిత కుటుంబా ల్లో ర్హత ఉన్న వారికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ హామీ ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వం నుంచి అందే సాయం త్వరగా వచ్చేలా కృషి చేస్తామన్నారు. కొందరు రాజకీయం చేస్తూ బురదచల్లే ప్రయత్నాలు చేస్తున్నారని అలాంటి వారి మాటలు నమ్మవద్దన్నారు. అర్హత ఉన్న యువత సర్టిఫికెట్లను ఎమ్మెల్యే పరిశీలించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....