MLA DAGGUPATI : గ్రామాలను పట్టించుకోని వైసీపీ పాలన
ABN , Publish Date - Nov 29 , 2024 | 12:45 AM
వైసీపీ పాలనలో గ్రామ పంచాయ తీలను సమస్యలకు నిలయాలుగా మార్చారని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు. మండ లంలోని రుద్రంపేట పంచాయితీ లో గురువారం మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్ర మాన్ని చేపట్టారు. ఆంజనేయస్వామి ఆలయం వద్ద నుంచి ఇంటింటికి తిరుగుతూ స్థానికులతో సమస్యలను తెలుసుకు న్నారు. డ్రైనేజీలు, రోడ్లు, వీధిలైట్ల సమస్యలను వా రు ఎమ్మెల్యే దృష్టికితీసుకెళ్లారు.
ఎమ్మెల్యే దగ్గుపాటి
అనంతపురం రూరల్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): వైసీపీ పాలనలో గ్రామ పంచాయ తీలను సమస్యలకు నిలయాలుగా మార్చారని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు. మండ లంలోని రుద్రంపేట పంచాయితీ లో గురువారం మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్ర మాన్ని చేపట్టారు. ఆంజనేయస్వామి ఆలయం వద్ద నుంచి ఇంటింటికి తిరుగుతూ స్థానికులతో సమస్యలను తెలుసుకు న్నారు. డ్రైనేజీలు, రోడ్లు, వీధిలైట్ల సమస్యలను వా రు ఎమ్మెల్యే దృష్టికితీసుకెళ్లారు. రజకు లకు దోభీ గాట్లు అదనంగా నిర్మించి వాటికి ప్రహరీ ఏ ర్పాటు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. రు ద్రంపేట- తగరకుంట వెళ్లే రోడ్డును కేవలం కంకర వేసి వదిలే శారని, సీఎం చంద్రబాబు సహకారంతో రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్న ట్లు తెలిపారు. నియోజకవర్గంలో సమస్యలను ప్రాధాన్యత వారీగా ప రిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్ర మంలో ఎంపీడీఓ దివాకర్, ఈఓ ఆర్డీ వెంకటనాయుడు, పంచాయతీ కార్యదర్శి హిదయతుల్లా, జనసేన నగర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాబురావు, ఇమామ్‌హుస్సేన, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్‌యాదవ్, రజక కార్పొరేషన రాష్ట్ర డైరెక్టర్ పరమేశ్వరన, తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వప్న, అధికార ప్ర తినిధి తేజస్విణి, పంచాయతీ నాయకులు శ్రీనివాస రెడ్డి, భాష, ఈడిగ నాగభూషణం, వెంకటరాముడు, కదిరప్ప, బాలప్ప, నాగ, అంజి, ఆది, వెంకటేశ్వర్‌రెడ్డి, మున్వర్, పోతలయ్య, అశోక్, హరి పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....