Share News

MLA : వైసీపీ దొంగ నాటకాలు ఇకనైనా ఆపాలి

ABN , Publish Date - Dec 29 , 2024 | 12:53 AM

వైసీపీ ఆడుతున్న దొంగ నాటకాలను ఇప్పటికైనా ఆపాలని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ పేర్కొ న్నారు. టీడీపీ అర్బన కార్యాలయంలో శనివారం పలువురు టీడీపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు.

MLA : వైసీపీ దొంగ నాటకాలు ఇకనైనా ఆపాలి
MLA Daggupati talking to the media

ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌

అనంతపురం అర్బన, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ ఆడుతున్న దొంగ నాటకాలను ఇప్పటికైనా ఆపాలని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ పేర్కొ న్నారు. టీడీపీ అర్బన కార్యాలయంలో శనివారం పలువురు టీడీపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ పాలనలో జగన అవినీతి మూలంగా ఏపీ ప్రజలపై రూ.1.29 లక్షల కోట్ల విద్యుత భారం పడిందన్నారు. 2014లో చంద్రబాబునాయుడు పాలనలో ప్రారంభమయ్యే నాటికి 22.5 మిలియన యూనిట్ల లోటుతో విద్యుత ఉండేదని, అలాంటి పరిస్థితుల నుంచి మిగులు వి ద్యుత ఉండేలా సీఎం చంద్రబాబు చేశారన్నారు. వైసీపీ అధికారం చేపట్టిన నాటికి మిగులు విద్యుత ఉండగా, జగనరెడ్డి అవినీతి, కక్షసాధింపు చర్యలతో విద్యుత రంగం దెబ్బతినేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు విద్యుత చార్జీలు పెంచారంటూ నాటకాలు ఆడుగున్నారని మండిపడ్డారు. గాడి తప్పిన వ్యవస్థలను సీఎం చంద్రబాబు చక్కబెడుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బుగ్గయ్య చౌదరి, రాయల్‌ మురళీ, పోతుల లక్ష్మీనరసింహులు, పరమేశ్వరన, లక్ష్మీనరసింహ, రామలింగ తదితరులు పాల్గొన్నారు.


పీఎం ఆవాస్‌ యోజనను సద్వినియోగం చేసుకోండి

పట్టణ ప్రాంతాల్లో నివశించే పేదల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపడుతున్న ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ సూచిం చారు. నగరంలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ఆయన శనివారం హౌసింగ్‌ పీడీ శైలజ, నగర పాలక సంస్థ కమిషనర్‌ రామలింగేశ్వరరెడ్డి, డీఈ మధుసూదనరెడ్డితో ఇళ్ల నిర్మాణాలపై సమీక్షించారు. అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి, త్వరగా మంజూరు ఉత్తర్వులు జారీ చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Dec 29 , 2024 | 12:54 AM