Share News

Live Updates: హైకోర్టుకు చేరిన తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారం

ABN , First Publish Date - Sep 20 , 2024 | 07:02 AM

Breaking News Live Updates: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

Live Updates: హైకోర్టుకు చేరిన తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారం
ABN Breaking

Live News & Update

  • 2024-09-20T13:53:01+05:30

    జానీ మాస్టర్‌కు వచ్చే నెల మూడు వరకు రిమాండ్ విధింపు

    తన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న 21 ఏళ్ల యువతిపై జానీ మాస్టర్ అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జానీ మాస్టర్‌కు అక్టోబర్ 3 వరకు రిమాండ్ విధిస్తూ ఉప్పర్‌పల్లి కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 14 రోజులు రిమాండ్ విధిస్తున్నట్టు న్యాయస్థానం వెల్లడించింది. మరి కాసేపట్లో పోలీసులు ఆయనను చెంచలగూడ జైలుకు తరలించనున్నారని తెలుస్తోంది. జానీ మాస్టర్‌పై ఫోక్స్ యాక్ట్ నమోదవడంతో రంగారెడ్డి జిల్లా కోర్టులో ఆయన న్యాయవాది బెయిల్ పిటిషన్ వేయనున్నారని సమాచారం.

  • 2024-09-20T13:28:03+05:30

    సుప్రీంకోర్ట్ యూట్యూబ్ ఛానల్ పునరుద్ధరణ

    supreme court.jpg

    • యూట్యూబ్ ఛానెల్‌ను హ్యాక్ చేసిన గుర్తుతెలియని దుండగులు

    • ఆ యూట్యూబ్ ఛానెల్‌లో క్రిప్టో కరెన్సీ షో ప్రదర్శన

    • వెంటనే అప్రమత్తమైన సంబంధిత విభాగం

    • యూట్యూబ్ ఛానెల్‌ను పునరుద్ధరించిన సిబ్బంది

    • యూట్యూబ్ ఛానెల్ హ్యాక్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన చేయని సుప్రీంకోర్టు వర్గాలు

  • 2024-09-20T13:25:21+05:30

    వైఎస్ షర్మిల కామెంట్స్..

    • తప్పు ఎవరు చేశారనేది తేలాల్సిన అవసరం ఉంది

    • నిజంగానే తప్పు జరిగిందా.. లేక నిందలు వేస్తున్నారా?

    • లడ్డూ వివాదం విషయంలో కేంద్రానికి లేఖ రాశాను

    • చంద్రబాబు గారి100 రోజుల పాలనలో.. శిషుపాలుడు తప్పులు చేసినట్లు జగన్ తప్పులను శ్వేతా పత్రాల రూపంలో చూపారు

    • 100 రోజుల పాలనలో రాజశేఖర రెడ్డి విగ్రహలు ధ్వంసం చేశారు

    • మోదీ గారి ఆధ్వర్యంలో సినిమా అట్టర్ ఫ్లాప్

    • ఒక మోసపురిత ప్రభుత్వాన్ని దింపి మీకు అధికారం ఇచ్చినప్పుడు ప్రజల ఆకాంక్ష నిలబెట్టుకోలేదు

    • సూపర్ సిక్స్ ఇప్పటికీ అమలు కాలేదు ఎందుకు సర్?

    • సూపర్ సిక్స్‌లో ఒక్క హామీ కూడా అమలు చేయలేదు

    • అన్నీ అమలు చేయమని చెప్పలేదు.. కానీ ఒక్కటి కూడా ఆచరణలోకి రావడం లేదు

    • రైతు భరోసా, ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, తల్లికి వందనం, ప్రతి మహిళకి ప్రతి నెల రూ.1500 ఇస్తామన్నారు.

    • మూడు సిలిండర్లు, ఉచిత బస్సు ఊసే లేదు

  • 2024-09-20T13:16:01+05:30

    లడ్డూ వివాదం.. సీఎం చంద్రబాబుపై వైఎస్ షర్మిల విసుర్లు

    YS-Sharmila.jpg

    • చంద్రబాబు గారు చావు కబురు చల్లగా చెప్పినట్లు ఒక బాంబు పేల్చారు

    • తిరుపతి లడ్డూలు జంతువుల నూనెతో తయారు చేస్తున్నారు అన్నారు

    • జగన్ ఎంపిక చేసిన కాంట్రాక్టరే ఉన్నారు

    • కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి

    • దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారు

    • లడ్డూ ప్రసాదంలో బిఫ్ ఆయిల్, ఫిష్ ఆయిల్ కలిశాయని చంద్రబాబు వెల్లడించారు

    • ఇంత పెద్ద విషయం అంత సునాయాసంగా ఎలా చెప్పారు?

    • మీకు ముందుగానే తెలిస్తే ఎందుకు ఆలస్యంగా ఈ విషయం చెప్పారు.

    • మీ100 రోజుల పాలన సెలెబ్రేషన్స్‌లో చెప్పాలని ఆగరా?

    • ఇంతా ఆలస్యంగా ఎందుకు చెప్తున్నారు. మీ ఉద్దేశ్యం ఏమిటి?

    • 100 రోజుల పాలనా సభలో వైసీపీపై విషం చిమ్మే ఉద్దేశ్యంలో భాగంగా ఈ విషయం చెప్పారా?

    • ఈ విషయంపై సీబీఐ విచారణ జరగాలి

  • 2024-09-20T13:07:00+05:30

    రాజేంద్రనగర్‌ సీసీఎస్‌‌కు జానీ మాస్టర్‌ తరలింపు

    • కాసేపట్లో ఉప్పర్‌పల్లి కోర్టుకు తరలించనున్న పోలీసులు

    • మరికొద్ది సేపట్లో న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్న పోలీసులు

    • జానీ మాస్టర్‌కు పూర్తయిన వైద్య పరీక్షలు

    • జాయ్ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహణ

    • నిన్న (గురువారం) గోవాలో అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించిన అధికారులు

  • 2024-09-20T13:05:29+05:30

    • బంగారుపాలెం ప్రభుత్వాసుపత్రి వద్ద మంత్రి నారా లోకేశ్‌కు గజపూలమాలలతో ఘనస్వాగతం

    • రిబ్బన్ కట్ చేసి డయాలిసిస్ కేర్ సెంటర్‌ను చేసి ప్రారంభించిన మంత్రి

    • లోకేశ్ వెంట చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్

  • 2024-09-20T12:54:10+05:30

    CPI-Narayana.jpg

    తిరుపతి లడ్డూ వివాదంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందన

    • భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వం వ్యవహరించింది

    • ధర్మారెడ్డి అనే అధికారి వైసీపీ నేతగా వ్యవహరించారు

    • సుప్రీంకోర్టు పర్యవేక్షణలో వీలైనంత త్వరగా విచారణ జరపాలి

    • బాధ్యులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

    • లక్షల మంది ప్రతి రోజూ లడ్డూలు కొనుగోలు చేస్తారు

    • పబ్లిక్ సెక్టార్‌లో ఉన్న డైరీకి నెయ్యి తయారీ కాంట్రాక్టు ఇవ్వాలి

  • 2024-09-20T12:05:50+05:30

    పార్టీ బలోపేతంపై టీపీసీసీ కొత్త చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోకస్

    • రేపటి (శనివారం) నుంచి జిల్లాల వారీగా గాంధీ భవన్‌లో సమీక్ష చేయనున్న పీసీసీ చీఫ్

    • సమీక్షకు హాజరుకానున్న డీసీసీ అధ్యక్షులు, మంత్రులు, జిల్లా ఇంచార్జ్ మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు

    • రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వరంగల్ జిల్లా సమీక్ష

    • మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు కరీంనగర్ జిల్లా సమీక్ష

    • సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు నిజామాబాద్ జిల్లా సమీక్ష

  • 2024-09-20T11:50:30+05:30

    cm-revanth-reddy.jpg

    ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్ట్ కీలక నిర్ణయం

    • ఈ కేసును మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయబోమన్న జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథ్‌ల ధర్మాసనం

    • విచారణ బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణను ముగించిన న్యాయస్థానం

    • ఓటుకు నోటు కేసును తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్‌కు బదిలీ చెయ్యాలంటూ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పిటిషన్

    • విచారణను సీఎం ప్రభావితం చేస్తారన్న అపోహ తప్ప ఆధారాలు లేవన్న సుప్రీంకోర్ట్

    • విచారణ జరుగుతున్న ఈ దశలో జగదీశ్వర్ రెడ్డి పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోచేయలేమని స్పష్టత

    • ఈ కేసు విచారణలో జోక్యం చేసుకోవద్దని రేవంత్‌కు సుప్రీంకోర్ట్ ఆదేశాలు

    • కేసుకు సంబంధించిన వివరాలను రేవంత్‌ రెడ్డికి రిపోర్ట్ చేయవద్దంటూ ఏసీబీని కూడా ఆదేశాలు

    • సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణకు కూడా నిరాకరణ

    • భవిష్యత్తులో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుంటే పిటిషనర్ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని సూచన

  • 2024-09-20T11:27:46+05:30

    ap high court.jpg

    హైకోర్టుకు చేరిన తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారం

    • తిరుమల లడ్డూపై దుష్ప్రచారం జరుగుతోందని ప్రస్తావించిన సీనియర్ కౌన్సిల్ పొన్నవోలు సుధాకర రెడ్డి

    • తిరుమల లడ్డూపై దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలని వినతి

    • హైకోర్ట్ కమిటీ వేసి విచారణ జరపాలని అభ్యర్థన

    • ఇప్పుడు అత్యవసరంగా చేయాల్సిన అవసరం లేదన్న హైకోర్ట్ ధర్మాసనం

    • వచ్చే బుధవారం విచారిస్తామని తేల్చిచెప్పిన హైకోర్ట్

  • 2024-09-20T11:07:06+05:30

    చెన్నై టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఆలౌట్

    • 368 పరుగులకు ఆలౌట్ అయిన భారత్

    • 2 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్

    • 113 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన రవిచంద్రన్ అశ్విన్

    • జడేజా 86, యశస్వి జైస్వాల్ 56, రిషబ్ పంత్ 39 పరుగులతో కీలక స్కోర్లు

    • 5 వికెట్లు తీసిన హసన్ మహ్మద్

    • తస్కిన్ అహ్మద్ -3 వికెట్లు, నషీద్ రానా, మెహదీ హసన్ చెరో వికెట్

  • 2024-09-20T10:39:28+05:30

    వైఎస్ జగన్‌పై కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు

    • ఫిర్యాదు చేసిన ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్

    • వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హిందువుల ఆత్మను హత్య చేశారు

    • హిందువుల నమ్మకాలను, విశ్వాసాలను, ఆలయం పవిత్రతను ఘోరంగా దెబ్బతీశారు

    • ఉద్దేశపూర్వకంగా, కావాలనే ఇలాంటి చర్యలకు జగన్ మోహన్ రెడ్డి పాల్పడ్డారు

    • జగన్ మోహన్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలి

  • 2024-09-20T10:33:53+05:30

    తిరుపతి లడ్డూలో కొవ్వు వ్యవహారం..

    • మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు స్పందన

    • శ్రీవారి ఆలయంలో జరుగుతున్న పరిణామాలు బాధ కలిగిస్తున్నాయి

    • మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలతో భక్తులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు

    • అన్నం పెట్టే దేవుడికి రుచిగా, సుచిగా నివేదనలు పెట్టాలి

    • నైవేద్యంలో కల్తీ జరగడం బాధాకరం

    • స్వామి వారికి సరైన రీతిలో నివేదనలు జరగడం లేదు

    • ఇవన్నీ చూసే పాపం మనం చేశామా అని బాధ కలుగుతోంది

    • గతంలో చాలా సార్లు టీటీడీ చైర్మన్, ఈవో దృష్టికి తీసుకెళ్లాను

    • గత కొద్ది సంవత్సరాలుగా ఒంటరి పోరాటం చేస్తున్నాను

    • గత 5 సంవత్సరాలు తిరుమలలో మహాపాపం జరిగింది

    • నెయ్యిలో కొవ్వు పదార్ధాలు కలవడం వల్ల అపచారం జరిగింది

    • సీఎం చంద్రబాబు ఆదేశాలతో తిరుమలలో ప్రక్షాళన జరుగుతోంది

    • ప్రస్తుతం శుద్ధమైన ఆవు నెయ్యితో ప్రసాదాలు చెయ్యడం హర్షణీయం

    • ఆగమంపైన పట్టు ఉన్న వారికి స్వామివారి సేవ చేసే అవకాశాన్ని సీఎం కల్పించాలి

    • నెయ్యి కల్తీపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

    • గత ప్రభుత్వంలో నన్ను హింసలు పెట్టారు

    • నాపైన పెట్టిన కేసులు ఎత్తి వేయ్యాలి

    • పోటులో సంప్రోక్షణ చేసి లడ్డూ తయారీని పునః ప్రారంభించాలి

    • ప్రస్తుత ఆగమ కమిటీని ఉద్యోగులతో భర్తీ చేశారు

    • వాళ్లు ఎలాంటి నిర్ణయాలు అమలు చేేయలేరు

    • ఆగమ సలహాదారులుగా ఇతర రాష్ట్రాల వారిని నియమించాలి

    • నన్ను ఆలయానికి దూరంగా పెట్టారు

  • 2024-09-20T10:23:46+05:30

    రెండో రోజు ఆరంభంలో 2 వికెట్లు కోల్పోయిన భారత్

    • రవీంద్ర జడేజా(86), ఆకాశ్ దీప్ (17) ఔట్

    • ప్రస్తుతం క్రీజులో ఉన్న అశ్విన్ (112), జస్ప్రీత్ బుమ్రా (4)

  • 2024-09-20T10:15:43+05:30

    వారాంతంలో స్టాక్ మార్కెట్ల జోరు

    అమెరికా స్టాక్ మార్కెట్‌లలో లాభాలు ఆసియా మార్కెట్లపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి. వారాంతమైన శుక్రవారం దేశీయ మార్కెట్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 421 పాయింట్లు లేదా 0.51 శాతం పెరిగి 83,606 వద్ద, నిఫ్టీ 112 పాయింట్లు లేదా 0.44 శాతం వృద్ధి చెంది 25,528 స్థాయికి చేరుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 184 పాయింట్లు లాభపడి 53,221 పరిధిలో ఉండగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 278 పాయింట్లు ఎగబాకి 59,614కి చేరింది.

    జేఎస్‌డబ్ల్యూ స్టీల్, కోల్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, టాటా స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు లాభాల్లో ఉన్న టాప్-6 స్టాక్స్‌గా ఉన్నాయి. అదే సమయంలో సిప్లా, ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, టైటాన్ కంపెనీ, గ్రాసిమ్, ఇండస్ ఇండ్ సంస్థల స్టాక్స్ టాప్-6 నష్టదారులుగా ఉన్నాయి. మెటల్, రియల్టీ రంగ సూచీలు 1.73 శాతం వరకు పెరిగాయి.

  • 2024-09-20T10:03:31+05:30

    కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు

    • ఓడ దాటేదాక ఓడ మల్లన్న, ఓడ దాటకా బోడి మల్లన్న అన్నటుంది కాంగ్రెస్ పాలనా

    • అరచేతిలో బెల్లం పెట్టి మోచేతిని నాకిస్తున్నారు ఇప్పుడు

    • రైతు భరోసా, రుణమాఫీ పై ఎన్నికల వేల బీరాలు పలికి ముఖ్యమంత్రి ఇప్పుడు నేల చూపులు చూస్తున్నాడు

    • తాజాగా రైతు భరోసాపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రైతన్నలను అయోమయానికి గురిచేస్తున్నాయి

    • కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వలేమని కుండబద్దలు కొట్టాడు.

    • కౌలు రైతులను నమ్మించి తడి గుడ్డతో గొంతు కోసింది కాంగ్రెస్ ప్రభుత్వం

    ktr.jpg

    • మొన్న రుణమాఫీ పేరిట మోసం చేశారు

    • నిన్న వానాకాలం పెట్టుబడి సాయం ఎగ్గొట్టారు

    • నేడు కౌలు రైతుకు భరోసా ఇవ్వలేమని చేతులెత్తేస్తారా ?

    • కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చెప్పిందేంటి? చేస్తున్నదేంటి?

    • 420 హామీల్లో ఒక్కో వాగ్దానాన్ని సీఎం పాతరేస్తున్నారు?

    • చేతకానప్పుడు హామీలు ఇవ్వడమెందుకు?

    • అధికారంలోకి రాగానే మాటతప్పడమెందుకు?

    • ఇది ముమ్మాటికీ మోసం.. నయవంచన..

    • గద్దెనెక్కాక గొంతుకోసిన వారిని అస్సలు వదిలిపెట్టరు

    • ఈ వెన్నుపోటుకు ముఖ్యమంత్రి మూల్యం చెల్లించుకోక తప్పదు

  • 2024-09-20T09:19:23+05:30

    కూటమి పాలనకు నేటితో 100 రోజులు

    • సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ఏ కూటమి ప్రభుత్వ పాలనకు 100 రోజులు

    • అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమాలతో మధ్య సమతూకం పాటిస్తున్న ప్రభుత్వం

    • నిత్యం పరదాల మాటున కాకుండా ప్రజల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్‌లు

    • 100 రోజుల పాలనకు గుర్తుగా నేటి నుంచి ఈ నెల 26వ తేదీ దాకా ‘ఇది మంచి ప్రభుత్వం’ పేరుతో ప్రజల్లోకి ప్రజాప్రతినిధులు

    • ప్రకాశం జిల్లా చదలవాడ గ్రామంలో జరగనున్న కార్యక్రమంలో పాల్గొంటున్న చంద్రబాబు

    • ప్రతి నియోజకవర్గంలో ప్రజల వద్దకు జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు

    • ఈ నెల 26 వరకు పాల్గొనేలా కార్యక్రమానికి నేటి నుంచి శ్రీకారం

    • గ్రామ, వార్డు సభలు నిర్వహించి 100 రోజుల పాలనపై అవగాహన కలించేలా విస్తృత కార్యక్రమాలు

  • 2024-09-20T09:10:47+05:30

    వైసీపీ అరాచకం.. తెలుగు యువనేత కారుకు నిప్పు

    • పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలంలోని మూగచింతలపాలెంలో వైసీపీ ఆరాచకం

    • తెలుగు యువనేత పోక వెంకట్రావు కారుకు నిప్పు పెట్టిన ప్రత్యర్థులు

    • అర్ధరాత్రి ఇంటి ముందు ఉన్న కారుని తగలబెట్టిన వైనం

    • మంటలు రావడంతో అప్రమత్తమైన గ్రామస్తులు

    • మంటలు ఆర్పి పోలీసులకు ఫిర్యాదు

    • కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్న ఎస్‌ఐ బాలకృష్ణ

  • 2024-09-20T09:03:17+05:30

    నార్సింగ్ పోలీస్ స్టేషన్‌‌లోనే జానీ మాస్టర్

    • మరికొద్ది సేపట్లో ఆయనను కోర్టు ముందు హాజరుపరచనున్న నార్సింగ్ పోలీసులు

    • గోవాలో అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలింపు

    • వైద్య పరీక్షల అనంతరం న్యాయస్థానం ముందు హాజరుపరచనున్న పోలీసులు

    • విచారణకు సమయం లేకపోవడంతో కస్టడీకి కోరనున్న పోలీసులు

    • వారం రోజులపాటు కస్టడీ ఇవ్వాలని పిటిషన్ వేయనున్న పోలీసులు

  • 2024-09-20T08:17:03+05:30

    రహస్య ప్రదేశంలో జానీ మాస్టర్‌ను విచారిస్తున్న పోలీసులు!

    • కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను నిన్న (గురువారం) అరెస్ట్ చేసిన పోలీసులు

    • గోవా నుంచి హైదరాబాద్‌కు తరలించిన పోలీసులు

    • రహస్య ప్రదేశంలో జానీ మాస్టర్‌ను విచారణ

    • నేడు పోక్సో కోర్టు ముందు హాజరు పరచనున్న అధికారులు

  • 2024-09-20T08:06:26+05:30

    revanth1.jpg

    నేడు తెలంగాణ కేబినెట్ భేటీ

    • సీఎం రేవంత్ అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో సమావేశం

    • పలు కీలక అంశాలపై చర్చించనున్న మంత్రివర్గం

    • హైడ్రాకు చట్టబద్దత కల్పించేలా ఆర్డినెన్సుకు ఆమోదించనున్న మంత్రివర్గం

    • ధరణి కమిటీ చేసిన 54 సిఫారసులపైనా చర్చ, అమలుపై కేబినెట్ నిర్ణయం

    • బీసీ కుల గణనపై చర్చ

    • పలు విశ్వవిద్యాలయాలకు కొత్త పేరు పెట్టడపై చర్చ

    • హైదరాబాద్‌లోని తెలుగు యూనివర్సిటీకి ప్రముఖ కవి, రచయిత, పాత్రికేయుడు సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం

    • మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు

    • ఫోర్త్ సిటీలో ఏర్పాటు చేస్తున్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్ టైల్స్‌కు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టాలని నిర్ణయం

    • ఈ మూడింటికీ ఆమోదముద్ర చేయనున్న మంత్రి వర్గం

    • కొత్తగా ఏర్పాటు చేయాలనుకుంటున్న 225 గ్రామ పంచాయతీలు, ఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్న మునిసిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం అంశాలపైనా నేటి కేబినెట్‌లో చర్చ

  • 2024-09-20T08:03:03+05:30

    నేటి నుంచి తిరిగి కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ

    • నేడు కమిషన్ ముందు హాజరుకానున్న ఏడుగురు సీఈ స్థాయి ఇంజనీర్లు

    • విచారణకు రానున్న రీసెర్చ్ ఇంజనీర్లు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు

    • గత నెలలో 15 మందికి పైగా అధికారులను విచారణ చేసి స్టేట్‌మెంట్స్ రికార్డు చేసిన చంద్ర ఘోష్ కమిషన్

    • ఇవాళ్టి నుంచి మరో 25 మందిని విచారణ చేయనున్న కమిషనర్

    • ఎన్‌డీఎస్ఏ, పూణే రిపోర్ట్ కోసం లేఖలు రాసిన కమిషన్

    • కమిషన్ అడిగిన లాయర్‌ను ఇవ్వడానికి అంగీకరించిన ప్రభుత్వం

    • విచారణకు పిలిచిన ప్రతీ ఒక్కరి నుంచి అఫిడవిట్ రూపంలో వివరాలు తీసుకుంటున్న కమిషన్

  • 2024-09-20T07:33:52+05:30

    ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

    • ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని ఇంటర్ పోల్‌కు లేక రాసిన సీబీఐ

    • హైదరాబాద్ పోలీసుల విజ్ఞప్తిని అనుమతించిన కేంద్ర దర్యాప్తు సంస్థ

    • ఇంటర్ పోల్ ద్వారా ప్రభాకర్ రావు, శ్రవణ్‌ కుమార్ రావులకు త్వరలో జారీ కానున్న రెడ్ కార్నర్ నోటీసులు

    • కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు

    • ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు గుర్తింపు

  • 2024-09-20T07:26:14+05:30

    వినాయక నిమజ్జనంలో ఉద్రిక్తత

    • తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరులో వినాయక నిమజ్జనంలో ఉద్రిక్తత

    • రాళ్లు రూవ్విన అల్లరి మూకలు

    • స్థానిక శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన వినాయక నిమజ్జన యాత్రలో ఉద్రిక్తత

    • పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అదనపు పోలీసు బలగాలు రాక

    • ఘర్షణలో ఇద్దరు పోలీసు అధికారులకు స్వల్ప గాయాలు

    • అర్ధరాత్రి 1 గంట వరకు ఘర్షణ వాతావరణం

    • ఇరువర్గాలు ఒకరిపై ఒకరిపై పోలీసులకు ఫిర్యాదు

    • ఘటనా స్థలంలో పోలీస్ పికెట్లు ఏర్పాటు

  • 2024-09-20T07:09:18+05:30

    ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఇదే...

    • ఇవాళ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు

    • మద్దిరాలపాడు గ్రామంలో జరిగే ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి

    • మధ్యాహ్నం 2 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరనున్న చంద్రబాబు

    • 2.30 గంటలకు నాగులుప్పలపాడు మండలం చదలవాడ చేరుకోనున్న సీఎం

    • మద్దిరాలపాడు గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజల్ని కలవనున్న చంద్రబాబు

    • అనంతరం గ్రామ సభలో పాల్గొననున్న ముఖ్యమంత్రి

    • సాయంత్రం 5 గంటలకు తిరిగి ఉండవల్లి బయలుదేరి వెళ్లనున్న సీఎం చంద్రబాబు

  • 2024-09-20T07:05:31+05:30

    chandrababu-ap-cabinet.jpg

    నేటి నుంచే ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం

    • 100 రోజులు పాలనలో సాధించిన విజయాలపై ప్రజల్లోకి వెళ్తున్న కూటమి ప్రభుత్వం

    • నేడు ప్రకాశం జిల్లాలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

    • మద్దిరాలపాడులో ప్రజలతో ముఖాముఖి

    • వాతావరణం అనుకూలించకపోవడంతో శ్రీకాకుళం జిల్లా పర్యటన రద్దు

    • 20వ తేదీ నుంచి వారం రోజులు పాటు ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం

    • తొలి 100 రోజుల్లో ప్రభుత్వం సాధించిన విజయాలు, తీసుకున్న ప్రజాహిత నిర్ణయాలు గురించి ప్రజలకు వివరణ ఇవ్వనున్న కూటమి నేతలు

  • 2024-09-20T07:02:02+05:30

    ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో బోటు ఒడ్డుకు చేరింది

    • రెండు రోజుల్లోనే ఆపరేషన్ పూర్తి

    • మొదటి బోటును ఒడ్డుకు చేర్చడానికి 11 రోజుల సమయం

    • రెండో బోటును కేవలం 2 రోజుల్లో ఒడ్డుకు తీసుకొచ్చిన ఇంజనీరింగ్ అధికారులు

    • రెండో బోటు సైతం కావడి విధానంలో ఒడ్డుకు చేర్చిన కాకినాడకు చెందిన అబ్బులు టీం

    • మరో బోటును ఈ రోజు తోగించే అవకాశం ఉందంటున్న ఇరిగేషన్ అధికారులు