Share News

Breaking News : నేడు 4వ రోజు అసెంబ్లీ సమావేశాలు..

ABN , First Publish Date - Nov 15 , 2024 | 08:41 AM

Andhra Pradesh Assembly Budget Session Live Updates: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం నాడు నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఇవాళ అసెంబ్లీలో 2 బిల్లులను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.

Breaking News : నేడు 4వ రోజు అసెంబ్లీ సమావేశాలు..

Live News & Update

  • 2024-11-15T13:45:54+05:30

    అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ రఘురామ పంచులు.. సీఎం చంద్రబాబు నవ్వులే నవ్వులు..

  • 2024-11-15T12:11:19+05:30

    శాసన మండలి నుండి వాకౌట్ చేసిన వైసిపి సభ్యులు

    • అమరావతి: శాసన మండలి నుండి వాకౌట్ చేసిన వైసిపి సభ్యులు.

    • ప్రభుత్వ మెడికల్ కాలేజీల అంశంపై మంత్రి సత్య కుమార్ సమాధానానికి వ్యతిరేకంగా వాకౌట్ చేసిన వైసిపి.

    • రాష్ట్రంలో గత ప్రభుత్వంలో అన్ని మెడికల్ కాలేజ్ ల నిర్మాణానికి ఒకే విధమైన నిధులు ఖర్చు చేయలేదన్న మంత్రి సత్యకుమార్.

    • పులివెందుల కాలేజ్ నిర్మాణానికి 500 కోట్లకు గాను 290 కోట్లు ఖర్చు చేశారన్న మంత్రి.

    • అదే సమయంలో మార్కాపురం కాలేజ్ 475 కోట్లకు గాను కేవలం 47 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్న మంత్రి సత్య కుమార్.

    • పులివెందులపై ఉన్న శ్రద్ద రాయలసీమలోని ఇతర కాలేజ్ ల పై ఎందుకు లేదో వైసిపి సభ్యులు చెప్పాలన్న మంత్రి.

    • పులివెందులలో ఆడపిల్లల హాస్టల్స్ కట్టకుండా వారు చెట్ల కింద కూర్చొని చదువుకోవాలా అన్న మంత్రి‌.

    • ప్రతిరోజు మెడికల్ కాలేజీ ల పై కూటమీ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి.

    • మంత్రి సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వాకౌట్ చేసిన వైసిపి.

  • 2024-11-15T11:35:08+05:30

    బడ్జెట్‌పై చర్చ.. ఎమ్మెల్యే విష్ణు ఇంట్రస్టింగ్ కామెంట్స్..

    • అమరావతి: బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆశక్తికర చర్చ.

    • చట్టంలో ఇంట్లో 6 మధ్యం బాటిళ్లు మాత్రమే పెట్టుకోవడానికి అనుమతి ఉంది.

    • గత ప్రభుత్వ హయంలో ఒక్క బాటిల్ ఎక్కవ ఉన్నా జగన్ జైల్లో వేసేస్తాడని పెట్టుకోలేదు.

    • మంచి మధ్యం అక్కడా ఇక్కడా తెచ్చి ఇంట్లో ఆరు బాటిళ్ళు పెట్టుకొని మిగలినవి దాచిపెట్టమని ప్రెండ్స్ కు ఇచ్చేవాళ్లం.

    • అయితే వారు తమకు గిప్ట్‌గా ఇచ్చారనుకొని ఖాళీ చేసేసే వారు.

    • ఇది చాలా పెద్ద సమస్య కాబట్టి బిజినెస్ హూస్ లకు అయినా ఈ కోటా పెంచాలని ఎక్సైజ్, హోంశాఖామంత్రులను కొరుతున్నా.

    • ఈ విషయం సభలో చెప్పోద్దు బాగోదు అని మా వాళ్లు అన్నారు.

    • అయితే ఇది చాలా ముఖ్యమయిన ఇబ్బంది పడే విషయం అందుకే చెప్పేశా.

    • స్టాంప్స్ అండ్ రిజిష్ట్రేషన్లు నుండి వచ్చే ఆదాయం రూ. 4,000 కోట్లు పెంచి చూపించారు అది ఎలా వస్తుంది.

    • రూ. 25,595కోట్లు ఎక్సైజ్ ద్వారా వస్తుంది అని మంత్రి కూడా చెప్పారు.

    • అయతే గత పభుత్వనికి కూడా ఇంత వచ్చి ఉంటుంది అనే అనుమానం ఉంది.

    • అంటే కనీసం రూ. 10వేల కోట్లు ప్రతి ఏడు వాళ్లు కొట్టేసారు.

    • మా లెక్కల ప్రకారం లిక్కర్‌లోనే వైసిపి రూ. 30వేల కోట్లు కొట్టేసింది.

  • 2024-11-15T10:13:05+05:30

    అసెంబ్లీలో క్షమాపణ చెప్పిన మంత్రి..

    • ఏపీ అసెంబ్లీ: కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ కు స్పీకర్ అయ్యన్న సూచన.

    • ప్రశ్నోత్తరాల సమయానికి అసెంబ్లీలో మంత్రి లేకపోవడంతో ప్రశ్న ముందుగా వాయిదా.

    • మంత్రి ఆలస్యంగా రావడంతో తిరిగి ప్రశ్న వేసిన సభ్యులు.

    • ప్రశ్నోత్తరాల సమయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని మంత్రిని కోరిన స్పీకర్.

    • మంత్రులే లేట్‌గా వస్తే ఎలా అంటూ ప్రశ్న.

    • సకాలంలో వచ్చేందుకు మంత్రులు ప్రయత్నించాలని కోరిన అయ్యన్న.

    • ఆలస్యానికి క్షమాపణ చెప్పిన మంత్రి సుభాష్.

  • 2024-11-15T10:08:05+05:30

    ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకుంటాం: మంత్రి నిమ్మల

    • అమరావతి: అసెంబ్లీలో మంత్రి నిమ్మల రామానాయుడు కామెంట్స్.

    • నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రంలో కరువు నివారించాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం.

    • 2019-24 వైసీపీ పాలనలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్‌కు రెండు దశల్లో 17050 కోట్లకు పాలనా అనుమతులు ఇచ్చి 5 రూపాయల పని కూడా చేయలేదు.

    • ఆర్ధిక ఇబ్బందులున్నా రూ. 1600 కోట్లతో ఇప్పటికే టెండర్లు పూర్తిచేసి టైం షెడ్యూల్ కూడా ఇచ్చాం.

    • ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి ప్రాధాన్యత పోలవరం ఐతే రెండో ప్రాధాన్యత ఉత్తారాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్.

    • వచ్చేనెలలో పనులు ప్రారంభించి 2025 జులై నాటికి గోదావరి వరద జలాలను ఉత్తరాంధ్ర కు అందిస్తాం.

    • ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకుంటాం.

  • 2024-11-15T09:18:40+05:30

    నాలుగో రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు..

  • 2024-11-15T08:41:04+05:30

    అమరావతి: నేడు 4వ రోజు అసెంబ్లి సమావేశాలు..

    assembly.jpg

    • ఉదయం 9 ప్రారంభ కానున్న అసెంబ్లీ.

    • ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలు.

    • ప్రశ్నోత్తరాలు అనంతరం బడ్జెట్ పై చర్చ.

    • బడ్జెట్ పై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్టేట్మెంట్.

    • నేడు అసెంబ్లీ లో 2 బిల్లులు ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం.

    • ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లైమెంట్ చట్ట సవరణ బిల్లు..2024 ను ప్రవేశ పెట్టనున్న ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్.

    • ఆంధ్ర ప్రదేశ్ ఎలక్ట్రసిటీ డ్యూటీ చట్ట సవరణ బిల్లు.2024 ను ప్రవేశ పెట్టనున్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్.