Temple Visit : శ్రీవారి సేవలో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్
ABN , Publish Date - Dec 21 , 2024 | 03:59 AM
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తిరుమల శ్రీవారిని శుక్రవారం దర్శించుకున్నారు.
తిరుమల, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తిరుమల శ్రీవారిని శుక్రవారం దర్శించుకున్నారు. వేకువజామున ఆలయంలో జరిగిన అభిషేకసేవలో పాల్గొన్నారు. అనంతరం ధ్వజస్తంభానికి మొక్కుకుని రంగనాయక మండపం వద్దకు చేరుకున్న ఆయన్ను వేదపండితులు ఆశీర్వదించారు. సీఎ్‌సకు శ్రీవారి లడ్డూప్రసాదాలను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అందజేశారు.