Share News

బీఎల్‌వోలకు రూ.58 కోట్ల గౌరవ వేతనం విడుదల

ABN , Publish Date - Dec 25 , 2024 | 04:07 AM

రాష్ట్రంలోని బూత్‌ లెవల్‌ ఆఫీసర్లకు(బీఎల్‌వోలకు) మొత్తం రూ. 58.62 కోట్లు గౌరవ వేతనం విడుదల చేస్తూ మంగళవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్‌ యాదవ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

బీఎల్‌వోలకు రూ.58 కోట్ల గౌరవ వేతనం విడుదల

  • మూడేళ్లు నిర్లక్ష్యం చేసిన వైసీపీ సర్కార్‌

  • కూటమి ప్రభుత్వం వచ్చాక సానుకూల చర్యలు

అమరావతి, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని బూత్‌ లెవల్‌ ఆఫీసర్లకు(బీఎల్‌వోలకు) మొత్తం రూ. 58.62 కోట్లు గౌరవ వేతనం విడుదల చేస్తూ మంగళవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్‌ యాదవ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 2021-22 మూడో త్రైమాసికం నుంచి 2023-24 మూడో త్రైమాసికం వరకూ ఈ గౌరవ వేతనం విడుదల చేశారు. కాగా, బీఎల్‌వోలకు గౌరవ వేతనం విడుదలపై ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు, ప్రధాన కార్యదర్శి అప్పలనాయుడు ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల బూత్‌ స్థాయి అధికారులకు మూడేళ్లు గౌరవ వేతనం ఇవ్వలేదన్నారు. కూటమి సర్కార్‌ అధికారంలోకి బకాయిల గురించి సీఈవో, రాష్ట్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. గౌరవ వేతనం విడుదల చేసినందుకు సీఎం చంద్రబాబు, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌, ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Dec 25 , 2024 | 04:08 AM