Share News

Paritala Ravi: పరిటాల రవి హత్య కేసులో నిందితులకు బెయిల్..

ABN , Publish Date - Dec 18 , 2024 | 06:20 PM

Paritala Ravi Murder Case: పరిటాల రవి హత్య కేసులో నిందితులకు బెయిల్ మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు ముద్దాయిలకు బుధవారం నాడు హైకోర్టు బెయిల్ మంజూరు..

Paritala Ravi: పరిటాల రవి హత్య కేసులో నిందితులకు బెయిల్..
Paritala Ravi

Paritala Ravi Murder Case: పరిటాల రవి హత్య కేసులో నిందితులకు బెయిల్ మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు ముద్దాయిలకు బుధవారం నాడు హైకోర్టు బెయిల్ మంజూరు చేసి ఊరటనిచ్చింది. 18 ఏళ్ల తరువాత ముద్దాయిలకు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు ధర్మాసనం. రవి హత్య కేసులో బెయిల్ పొందిన నిందితుల్లో A3 పండుగ నారాయణరెడ్డి, A4 రేఖమయ్య, A5 బజన రంగనాయకులు, A6 వడ్డే కొండ, A8 ఓబిరెడ్డి ఉన్నారు. వీరంత గురువారం నాడు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. 2005 జనవరి 24వ తేదీన అనంతపురం జిల్లా పెనుకొండలో టీడీపీ నేత పరిటాల రవిని ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. తుపాకీతో ఆయనను కాల్చి చంపేశారు. ఈ ఘటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించింది.

Updated Date - Dec 18 , 2024 | 07:02 PM