AP High Court: జగన్ పిటీషన్‌పై విచారణ.. ఏపీ హైకోర్టు సీరియస్
ABN , Publish Date - Sep 13 , 2024 | 08:28 PM
కొందరు పిటిషనర్లు కోర్టుల సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఏపీ హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులను ప్రచార వేదికలుగా చేసుకుంటున్నరాంటూ అసహనం వ్యక్తం చేసింది. ఇంప్లీడ్ పిటిషన్‌లో వాడిన భాషపై ఆగ్రహం వ్యక్తం చేసింది. భద్రత పునరుద్ధరించాలని మాజీ సీఎం జగనే నేరుగా..
అమరావతి, సెప్టెంబర్ 13: కొందరు పిటిషనర్లు కోర్టుల సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఏపీ హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులను ప్రచార వేదికలుగా చేసుకుంటున్నరాంటూ అసహనం వ్యక్తం చేసింది. ఇంప్లీడ్ పిటిషన్‌లో వాడిన భాషపై ఆగ్రహం వ్యక్తం చేసింది. భద్రత పునరుద్ధరించాలని మాజీ సీఎం జగనే నేరుగా కోర్టుకు వచ్చారని.. ఇందులో మూడో వ్యక్తి ఇంప్లీడ్ కావడం ఏంటని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇంప్లీడ్ పిటిషన్‌ను కొట్టేసి.. భారీగా ఖర్చులు విధిస్తామని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
జగన్‌కు భద్రత కేసులో ప్రభుత్వ కౌంటర్‌కు రిప్లే వేసేందుకు గడువు కావాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ఈ పిటీషన్‌లో ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ ఖాజా వలీ తాను కూడా ఇంప్లీడ్ అవుతానంటూ పిటీషన్ వేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు ధర్మాసనం.. కోర్టును ప్రచార వేదికలుగా వాడుకుంటున్నారని వ్యాఖ్యానించింది. కోర్టులను క్రీడా మైదానాలుగా భావిస్తున్నారా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది ధర్మాసనం.
ఇంప్లీడ్ పిటీషన్‌లో వాడిన బాష పట్ల హైకోర్టు ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కోర్టు హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని స్పష్టం చేసింది హైకోర్టు. ప్రధాన వ్యాజ్యంపై విచారణ అనంతరం ఇంప్లీడ్ పిటీషన్ కొట్టివేసి భారీగా ఖర్చులు విధిస్తామని స్పష్టం చేసింది ధర్మాసనం. జగన్ తరపు న్యాయవాది జోక్యం చేసుకుని ఇంప్లీడ్ పిటీషన్‌ను తాము కూడా వ్యతిరేకిస్తున్నామని న్యాయవాది సుమన్ చెప్పారు. దీనికి స్పందించిన న్యాయమూర్తి.. తమకు మద్దతుగా ఎలాంటి పిటీషన్ అవసరం లేదని స్పష్టం చేశారు.