Share News

AP Elections: రెండోసారి జగన్.. జనం రియాక్షన్ ఇదే..!

ABN , Publish Date - Apr 23 , 2024 | 12:05 PM

ఏపీలో వరుసగా రెండోసారి అధికారం కోసం వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వై నాట్ 175 నినాదంతో ముందుకెళ్లిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ ఆ నినాదాన్ని పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. జనం నాడిని పసిగట్టిన జగన్ అధికారానికి కావల్సిన మెజార్టీ మార్క్‌పై ప్రధానంగా దృష్టిపెట్టారు. తాము అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో తాము సునాయసంగా గెలుస్తామని భావించిన వైసీపీ ఆశలు ఫలించేట్లు కనిపించడంలేదు. ప్రజలు ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకతతో ఉన్నారో జగన్‌కు మేమంతా బస్సు యాత్రలో స్పష్టంగా కనిపించింది.

AP Elections: రెండోసారి జగన్.. జనం రియాక్షన్ ఇదే..!
YSRCP and Jagan

ఏపీలో వరుసగా రెండోసారి అధికారం కోసం వైసీపీ (YSRCP) తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వై నాట్ 175 నినాదంతో ముందుకెళ్లిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ ఆ నినాదాన్ని పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. జనం నాడిని పసిగట్టిన జగన్ అధికారానికి కావల్సిన మెజార్టీ మార్క్‌పై ప్రధానంగా దృష్టిపెట్టారు. తాము అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో తాము సునాయసంగా గెలుస్తామని భావించిన వైసీపీ ఆశలు ఫలించేట్లు కనిపించడంలేదు.


ప్రజలు ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకతతో ఉన్నారో జగన్‌కు మేమంతా బస్సు యాత్రలో స్పష్టంగా కనిపించింది. ఎక్కడికి వెళ్లినా యువత, మహిళలు కూటమికే జై కొడుతున్నారు. దీంతో ఈసారి గెలుపు కష్టమనే భావనకు జగన్ వచ్చినట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో జనం రియాక్షన్ చూసిన తర్వాత రెండోసారి అధికారంలోకి రావడం భ్రమ మాత్రమేనని వైసీపీ నాయకులకు ఓ క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు సత్పలితాలను ఇవ్వడంలేదనే ప్రచారం జరుగుతోంది. సానుభూతితో ఓట్లు పొందేందుకు జగన్ పన్నిన వ్యూహాలు ఫలించడం లేదట. దీంతో రెండోసారి అధికారం అనేది అసాధ్యమనే అంచనాకు వైసీపీ నాయకులు వచ్చినట్లు తెలుస్తోంది.

నా గెలుపు ఖాయం


జనం రియాక్షన్‌తో షాక్..

మేమంతా సిద్ధం యాత్రలో జనం రియాక్షన్ చూసి జగన్ షాక్ అయినట్లు తెలుస్తోంది. జగన్ బస్సు యాత్రకు ఆశించిన స్థాయిలో జనం రాలేదు. మరోవైపు తన ప్రభుత్వంపై ప్రజలు ఎంత వ్యతిరేకతతో ఉన్నారో జగన్ స్వయంగా చూశారు. ముఖ్యంగా రహదారుల సమస్యతో ఐదేళ్లుగా ప్రజలు విసిగిపోయారు. 2019 ఎన్నికల ముందు పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడంతో.. ప్రజలు జగన్ పట్ల అసంతృప్తితో ఉన్నారనే విషయం బయటపడింది. పాదయాత్ర సమయంలో స్థానిక అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. వాటి పరిష్కారం బాధ్యత తనదంటూ హామీ ఇచ్చారు. జగన్ మాటలను నమ్మి ప్రజలు భారీ మెజార్టీ ఇచ్చినప్పటికి.. హమీలు అమలు చేయలేకపోయారనే భావన ప్రజల్లో కనిపిస్తోంది. దీంతో రెండోసారి అధికారంలోకి రావడం కష్టమని జగన్‌కు స్వయంగా తెలిసొచ్చినట్లైందట.


జనం మూడ్ మారుద్దామని..!

మేమంతా సిద్ధం బస్సు యాత్రలో అసలు విషయాన్ని గమనించి సీఎం జగన్.. జనం మూడ్‌ను మార్చేందుకు విఫలయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వంపై వ్యతిరేకత, అభివృద్ధి ఎజెండా చర్చకు రాకుండా ప్రజలను మభ్యపెట్టేందుకు కొన్ని సెన్సిటివ్ అంశాలను తెరమీదకు తెచ్చేందుకు జగన్ ప్రయత్నించి విఫలమయ్యారనే ప్రచారం జరుగుతోంది. అభివృద్ధి అనేది ఎన్నికల ఎజెండా అయితే వైసీపీ ప్రభుత్వంపై మరింత వ్యతిరేకత పెరిగే అవకాశం ఉందనే ఆలోచనతో ప్రజల మూడ్ మార్చేందుకు పన్నిన వ్యూహం ఫలించలేదు. ఎన్నికలకు మరో 20 రోజులు మాత్రమే సమయం ఉంది. ఓవైపు కూటమి అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తుంటే కూటమి గెలవడం ఖాయంగా కనిపిస్తుందనే ప్రచారం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులే ఎన్నికల రోజు వరకు ఉంటే వైసీపీకి 20 నుంచి 30 స్థానాలు రావడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజలు ప్రభుత్వంపై ఏస్థాయిలో వ్యతిరేకతతో ఉన్నారు.. ఏ పార్టీని ఓటర్లు విశ్వసిస్తున్నారనేది జూన్4న తేలనుంది.


అవినీతి పార్టీకి ఓట్లు వేయొద్దు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest AP News and Telugu News

Read Latest National and Sports News

Updated Date - Apr 23 , 2024 | 12:05 PM