Share News

Information Technology : గ్లోబల్‌ టాలెంట్‌ హబ్‌గా ఏపీ

ABN , Publish Date - Dec 04 , 2024 | 04:18 AM

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ) రంగంలో రాష్ట్రాన్ని గ్లోబల్‌ టాలెంట్‌ హబ్‌గా నిలబెట్టే లక్ష్యంతో ఐటీ పాలసీ 2024-29ను ప్రభుత్వం రూపొందించింది.

Information Technology  : గ్లోబల్‌ టాలెంట్‌ హబ్‌గా ఏపీ

  • బహుళజాతి సంస్థలకు ప్రోత్సాహకాలు

  • ఐటీకి ఫాస్ట్‌ ట్రాక్‌ అనుమతులు

  • కేపిటల్‌ సబ్సిడీగా 50% రాయితీ

  • యువతకు ఉద్యోగాల కల్పనకే అత్యధిక ప్రాధాన్యం

  • 2024-29 ఐటీ పాలసీని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

అమరావతి, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ) రంగంలో రాష్ట్రాన్ని గ్లోబల్‌ టాలెంట్‌ హబ్‌గా నిలబెట్టే లక్ష్యంతో ఐటీ పాలసీ 2024-29ను ప్రభుత్వం రూపొందించింది. విశాఖను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దడంతో పాటు రానున్న ఐదేళ్లలో మైక్రోసాఫ్ట్‌ వంటి బహుళజాతి సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ఈ విధానానికి రూపకల్పన చేసింది. భారీ ఆర్థిక ప్రోత్సాహకాలతో పాటు నైబర్‌హుడ్‌, కోవర్కింగ్‌ స్పేస్‌ను అందించేలా శిక్షణ కార్యక్రమాలు, నిరంతర సాంకేతిక నైపుణ్యాభివృద్ధిని ఐటీ శాఖ కొనసాగించనుంది. ఇన్నోవేషన్‌ వ్యాలీ దిశగా అడుగులు వేస్తూ, ప్రతి కుటుంబంలోనూ ఒక పారిశ్రామికవేత్త ఉండేలా ఈ పాలసీని అమలు చేయాలని నిర్ణయించారు. నూతన ఐటీ పాలసీ ప్రకారం... నాలెడ్జ్‌ ఎకానమీలో రాష్ట్రం అభివృద్ధి చెందడంతో పాటు ఇక్కడి యువతలోని నైపుణ్యం ప్రపంచ స్థాయికి చేరేలా చర్యలు తీసుకుంటారు. డీప్‌ టెక్‌, అడ్వాన్డ్‌ టెక్నాలజీలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. స్టార్ట్‌పలు, సాంకేతిక రంగంలో కొత్త తరహా ఆలోచనలతో ముందుకొచ్చే సంస్థలను ప్రోత్సహిస్తారు. ఐటీ రంగంలోనూ యువత ఉద్యోగ కల్పనకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. ఐటీ కార్యాలయాలు లీజులకు ఇస్తారు.


టైర్‌-1 నగరాల్లో ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగుల ఎంపికకు వీలుగా ప్రత్యేక క్యాంప్‌సలను ప్రకటిస్తారు. వార్షిక టర్నోవర్‌ రూ.100 కోట్లు ఉండే కంపెనీలకు 2,000 సీట్లు, టర్నోవర్‌ రూ.100 కోట్లు పైబడిన సంస్థలకు 5,000 సీట్లు కలిగిన కార్యాలయాలు కేటాయిస్తారు. ఐటీ కంపెనీల డెవలపర్లకు 5లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన కార్యాలయం అందిస్తారు. కేపిటల్‌ సబ్సిడీగా 50శాతం పెట్టుబడి రాయితీ ఇస్తారు. పరిశ్రమలకు ఇచ్చే విద్యుత్తు టారి్‌ఫను ఐటీ కంపెనీలకూ అమలు చేస్తారు. ఫాస్ట్‌ ట్రాక్‌ అనుమతులతో పాటు ఎర్లీ బర్డ్‌ పథకం కింద ప్రభుత్వ కార్యాలయాల్లో ఐదేళ్ల పాటు అద్దె మినహాయింపు ఉంటుంది. వార్షిక టర్నోవర్‌ రూ.30 కోట్లు లేదా కనీసం 50 మంది ఉద్యోగులు ఉండే సంస్థలన్నింటికీ రాష్ట్ర ఐటీ శాఖ ప్రోత్సాహకాలను అందిస్తుంది. భూములు కూడా కేటాయిస్తారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ట్రాన్స్‌జెండర్‌ ఉద్యోగుల వాటా ఈపీఎ్‌ఫను వంద శాతం ఐటీ శాఖే భరిస్తుంది. ఇంటి అద్దె, పిల్లల విద్య కోసం ఉద్యోగులకు మూడేళ్ల పాటు రూ.లక్ష అందిస్తారు.

Updated Date - Dec 04 , 2024 | 04:19 AM