Share News

Andhra University : ఏపీఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల

ABN , Publish Date - Jun 28 , 2024 | 05:58 AM

రాష్ట్రవ్యాప్తంగా బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీఎడ్‌సెట్‌-2024 ఫలితాలను గురువారం మధ్యాహ్నం ఏయూలోని ఎడ్‌సెట్‌ కార్యాలయంలో కన్వీనర్‌ ప్రొఫెసర్‌ టి.వెంకట కృష్ణ విడుదల చేశారు.

Andhra University : ఏపీఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల

విశాఖపట్నం, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీఎడ్‌సెట్‌-2024 ఫలితాలను గురువారం మధ్యాహ్నం ఏయూలోని ఎడ్‌సెట్‌ కార్యాలయంలో కన్వీనర్‌ ప్రొఫెసర్‌ టి.వెంకట కృష్ణ విడుదల చేశారు. ఐదు సబ్జెక్టుల్లో ప్రవేశాలకు ఈ నెల ఎనిమిదో తేదీన రాత పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 10,805 మంది అభ్యర్థులు హాజరుకాగా 9,365 మంది (98.05 శాతం) అర్హత సాధించారు. కాకినాడ జిల్లాకు చెందిన కాకరపర్తి భావన ఫణి ప్రియ గణితశాస్త్రంలో, అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు చెందిన కాశీన వీరసాయి చంద్రిక భౌతికశాస్త్రంలో, విజయనగరం జిల్లాకు చెందిన ఇంజమూరి వెంకటసాయి మణికంఠ జీవశాస్త్రంలో, బాపట్ల జిల్లాకు చెందిన కొప్పుల శ్వేత సాంఘికశాస్త్రంలో, శ్రీకాకుళం జిల్లాకు చెందిన బొర్రా రమణి ఇంగ్లీష్‌ సబ్జెక్టులో టాప్‌ ర్యాంకర్లుగా నిలిచారు. ఫలితాలను ఏపీఎన్‌సీహెచ్‌ఈ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.

Updated Date - Jun 28 , 2024 | 05:58 AM