Share News

Chandrababu Govt: జులై 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

ABN , Publish Date - Jul 16 , 2024 | 02:37 PM

ఏపీ అసెంబ్లీ సమావేశాలు జులై 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు మంగళవారం అమరావతిలో సీఎం నారా చంద్రబాబు అధ్యక్షత జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Chandrababu Govt: జులై 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

అమరావతి, జులై 16: ఏపీ అసెంబ్లీ సమావేశాలు జులై 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు మంగళవారం అమరావతిలో సీఎం నారా చంద్రబాబు అధ్యక్షత జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ సమావేశాల్లో ఓటు ఆన్ అకౌంట్ పెట్టాలా? లేకుంటే ఆర్డినెస్స్ పెట్టాలా.. అనే అంశంపై ఈ భేటీలో కీలక చర్చ జరిగింది. అయితే మూడు రోజుల పాటు ఈ అంసెబ్లీ సమావేశాలు జరగనున్నాయని సమాచారం. గవర్నర్ ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక శ్వేత పత్రాల ప్రస్తావనను సైతం అసెంబ్లీలో తీసుకురావాలని కేబినెట్‌లో చర్చ జరిగినట్లు తెలుస్తుంది. మరోవైపు ఈ కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలు సైతం తీసుకున్నారు.

justice narasimha reddy: సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్‌పై విచారణ ప్రారంభం


ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ రద్దు బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే కొత్త ఇసుక విధానానికి సైతం పచ్చ జెండా ఊపింది. అయితే కొత్త ఇసుక పాలసీపై విధి విధానాలను సాధ్యమైంత త్వరలో రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే విధంగా పౌర సరఫరాల శాఖ రూ. 2 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారెంటీకి సైతం మంత్రి వర్గం ఆమోదించింది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు నిమిత్తం ఎన్సీడీసీ నుంచి రూ.3,200 కోట్ల రుణానికి వ్యవసాయ, సహకార కార్పోరేషన్‌కు ప్రభుత్వ గ్యారెంటీకి కూడా కేబినెట్ ఆమోదించింది.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 16 , 2024 | 02:39 PM