Share News

Botsa Satyanarayana: రేపటి నుంచి విధుల్లోకి అంగన్వాడీలు

ABN , Publish Date - Jan 23 , 2024 | 06:45 AM

అంగన్వాడీల సమ్మె ముగిసిందని.. వారు రేపటి నుంచి విధుల్లో చేరనున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ప్రభుత్వం అంగన్వాడీల సమస్యల పట్ల సానుకూలతతో ఉందన్నారు.

Botsa Satyanarayana: రేపటి నుంచి విధుల్లోకి అంగన్వాడీలు

విజయవాడ: అంగన్వాడీల సమ్మె ముగిసిందని.. వారు రేపటి నుంచి విధుల్లో చేరనున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ప్రభుత్వం అంగన్వాడీల సమస్యల పట్ల సానుకూలతతో ఉందన్నారు. 11 డిమాండ్లను అంగన్వాడీలు ప్రభుత్వం ముందు పెట్టారన్నారు. ఇప్పటికే 10 డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. అంగన్వాడీలకు ఇచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను రూ.లక్ష 20 వేలకు పెంచామన్నారు. అంగన్వాడీ హెల్పర్లకు రూ.60 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని బొత్స తెలిపారు. మినీ అంగన్వాడీలను పూర్తి స్థాయి అంగన్వాడీలుగా తీర్చిదిద్దుతామన్నారు. మట్టి ఖర్చుల కోసం అంగన్వాడీలకు రూ.20 వేలు ఇచ్చేందుకు అంగీకరించామన్నారు. అంగన్వాడీలు సమ్మె విరమించి ఇక విధులకు హాజరవుతారన్నారు. సమ్మె చేసిన కాలానికి ఏం చేయాలన్నదానిపై సీఎంతో చర్చించిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తామన్నారు. అలాగే వారిపై నమోదైన కేసులను ముఖ్యమంత్రితో చర్చించి ఎత్తివేస్తామన్నారు. స్పష్టమయిన హామీ ఇవ్వకుండానే బెదిరింపుల ద్వారా మెడ మీద కత్తి పెట్టి అంగన్వాడీలతో ప్రభుత్వం సమ్మె విరమింప చేసింది.

Updated Date - Jan 23 , 2024 | 12:47 PM