Share News

Aug 15: గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభించనున్న సీఎం

ABN , Publish Date - Aug 14 , 2024 | 08:41 PM

ఎల్లుండి నుండి వంద అన్న క్యాంటీన్లలో ఆహారం సిద్దంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. బుధవారం గుంటూరులోని చుట్టగుంటలో అన్నక్యాంటీన్ ఏర్పాటు పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం అందుకు సంబంధించిన పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Aug 15: గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభించనున్న సీఎం
AP Minister P Narayana

గుంటూరు, ఆగస్ట్ 14: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.. గురువారం (రేపు) గుడివాడలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభిస్తారని మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ వెల్లడించారు. ఎల్లుండి నుండి వంద అన్న క్యాంటీన్లలో ఆహారం సిద్దంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. బుధవారం గుంటూరులోని చుట్టగుంటలో అన్నక్యాంటీన్ ఏర్పాటు పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం అందుకు సంబంధించిన పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Also Read: Air India Flight : బయలుదేరిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక సమస్య..

Also Read: Kolkata RG Kar Hospital: ట్రైయినీ వైద్యురాలి పోస్ట్‌మార్టం నివేదికలో సంచలన విషయాలు


రాష్ట్రవ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లు..

ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. గతంలో 183 అన్న క్యాంటీన్లు నిర్వహించామని గుర్తు చేశారు. నాణ్యమైన ఆహారాన్ని కేవలం రూ. ఐదుకి అందించనున్నామని తెలిపారు. ఈ అన్న క్యాంటీన్లు ఏర్పాటుపై సర్వత్ర హర్షం వ్యక్తమవుతుందన్నారు. పేద, నిరుపేదల కోసమే ఈ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లు సిద్దం చేశామని చెప్పారు. అయితే ఒక రోజులో ఒక వ్యక్తికి ఆహారం అందించడానికి రూ. 90 రూపాయలు మేర ఖర్చవుతుందన్నారు. ఆ క్రమంలో రూ. 15 వినియోగదారుడు చెల్లిస్తే, మిగిలిన నగదు రూ. 75 ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు.

Also Read: United Nations: యూఎన్‌లో శాశ్వత ప్రతినిధిగా హరీశ్ పర్వతనేని నియామకం

Also Read: Jammu Kashmir Encounter: ఆర్మీ అధికారి మృతి, నలుగురు ఉగ్రవాదులు హతం..!


రూ. కోటి విరాళం ఇస్తే.. ఒక రోజు..

ఇక రూ. కోటి విరాళం ఇచ్చిన వారి పేరుతో ఒక రోజు ఆహారం అందిస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న పరిణామాలను ఈ సందర్బంగా ఆయన సోదాహరణగా వివరించారు. వైసిపి వాళ్ళు రివర్స్ టెండరింగ్ పేరుతో అన్ని వ్యవస్థలను నాశనం చేశారని మండిపడ్డారు. కానీ తమ ప్రభుత్వం అవినీతికి ఆస్కారం లేకుండా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశామన్నారు. తమ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో ప్రధానమైన ఫించన్లు ప్రారంభించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అందులోభాగంగా రూ. 33 వేల కోట్లు ఫించన్లు కోసం ఖర్చు చేస్తున్నామన్నారు.

Also Read: Rajya Sabha by-election: తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీ


మహిళలకు ఉచిత బస్సు పథకం..

మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని త్వరలోనే అమలు చేస్తామని ఆయన తెలిపారు. సూపర్ సిక్స్‌లోని పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తామని వివరించారు. తమ ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్దికి కూడా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఇక జగన్ ప్రభుత్వ పాలనలో అన్ని పార్టీల్లోని రాజకీయ నాయకులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారన్నారు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా వివిధ నగరాల్లోని కార్పోరేటర్లు, నాయకులు తమ పార్టీలో చేరుతున్నారని మంత్రి నారాయణ ఈ సందర్భంగా వివరించారు.

YS Viveka Murder Case: ఉదయ్‌కుమార్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

Also Read: Rachakonda CP: రియాజ్‌ను హత్య చేస్తే.. డాన్ అవుతాడనుకున్న హమీద్


సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రూ. కోటి విరాళం..

రూ. 5లకే కడుపు నింపే అన్న క్యాంటీన్లు పున: ప్రారంభం మహోన్నత కార్యక్రమమని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ఆగస్ట్ 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లను కూటమి ప్రభుత్వం ప్రారంభిస్తుంది. ఈ నేపథ్యంలో అన్న క్యాంటీన్లకు రూ. కోటి విరాళాన్ని నారా భువనేశ్వరి ప్రకటించారు. అందుకు సంబంధించిన చెక్‌ను మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణకు నారా భువనేశ్వరి అందజేశారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 14 , 2024 | 08:47 PM