Share News

CM Chandrababu: ఎన్ని కష్టాలున్నా.. రాష్ట్రాన్ని బాగు చేయాలన్న లక్ష్యాన్ని మాత్రం విడిచి పెట్టను

ABN , Publish Date - Dec 23 , 2024 | 08:05 PM

కరుణ, ప్రేమ, సేవకు ప్రతీక క్రిస్టియానిటీ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. స్వాత్రంత్ర్యం రాక ముందు నుంచి దేశ ప్రజలకు క్రిస్టియానిటీకి చెందిన విద్య సంస్థలు, ఆసుపత్రులు పెద్ద ఎత్తున సేవలందిస్తున్నాయని వివరించారు.

CM Chandrababu: ఎన్ని కష్టాలున్నా.. రాష్ట్రాన్ని బాగు చేయాలన్న లక్ష్యాన్ని మాత్రం విడిచి పెట్టను

అమరావతి, డిసెంబర్ 23: ఎన్ని కష్టాలున్నా రాష్ట్రాన్ని బాగు చేయాలన్న లక్ష్యాన్ని మాత్రం వదిలి పెట్టే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నాలుగో సారి ముఖ్యమంత్రి అయ్యాక దూసుకుపోవాలనే మనస్తత్వం తనకు ఉన్నా.. ఆ వెసులుబాటు మాత్రం లేదన్నారు. ముఖ్యమంత్రిగా పని చేసిన మూడుసార్లు లేని ఇబ్బందులు ప్రస్తుతం ఉన్నాయని తెలిపారు. గత 6 నెలల నుంచి రాత్రి పగలు ఆలోచిస్తూ పట్టుదలగా పరిశోధిస్తున్నా జరిగిన విధ్వంసానికి మాత్రం దారి దొరకట్లేదన్నారు. సోమవారం విజయవాడలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. క్రైస్తవులకు కూటమి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మైనార్టీ వర్గాల సంక్షేమానికి, భద్రతకు తెలుగుదేశం ప్రభుత్వం ఎల్లప్పుడు పెద్దపీట వేస్తుందని తెలిపారు.

Also Read : విశాఖ వాసులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి


గుంటూరులో క్రైస్తవ భవనాన్ని తాము పూర్తి చేస్తామని ప్రకటించారు. గత ఐదేళ్లలో భవన నిర్మాణం చేయకుండా పాలకులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. జెరూసలేం వెళ్లే క్రైస్తవులకు ఆర్ధిక సాయాన్ని అందించడం ప్రారంభించింది తమ ప్రభుత్వమేనని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. క్రైస్తవ స్మశాన వాటికల నిర్మాణానికి సైతం కృషి చేస్తామని తెలిపారు. క్రైస్తవ అనుబంధ కళాశాలలను గత పాలకులు ఎన్నో ఇబ్బందులకు గురిచేశారని విమర్శించారు.

Also Read: Yearender 2024: ఢిల్లీ మద్యం కుంభకోణం.. రాజకీయ ప్రకంపనలు


ఆర్ధిక అసమానతలను తగ్గించేందుకు కలిసి పనిచేద్దామని సీఎం చంద్రబాబు ప్రజలకు పిలుపు నిచ్చారు. రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత తనదని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తాను ఎల్లప్పుడు పేదల పక్షపాతినేనని చెప్పారు. ఇలా మీ అందరితో కలిసి సెమీ క్రిస్టమస్ వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.

Also Read: లుంగీ కట్టుకొని బెడ్ రూమ్ లో కూర్చో..ఎమ్మెల్యే మాధవి ప్రెస్ మీట్


కరుణ, ప్రేమ, సేవకు ప్రతీక క్రిస్టియానిటీ అని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్వాత్రంత్రం రాక ముందు నుంచి దేశ ప్రజలకు క్రిస్టియానిటీకి చెందిన విద్య సంస్థలు, ఆసుపత్రులు పెద్ద ఎత్తున సేవలందిస్తున్నాయని వివరించారు. వీటికి స్పూర్తిని సైతం ఏసు ప్రభువు ఇచ్చారన్నారు. నిరాడంబరమైన జీవితానికి ఏసు క్రీస్తు జీవితం ఉదాహరణ అని చెప్పారు. నమ్మిన వారి కోసం ఏసు క్రీస్తు బలి దానానికి సిద్దమైయ్యారన్నారు. ఆయన నుంచి ప్రతి ఒక్కరు ఉత్తేజాన్ని పొంద వలసిన అవసరం ఉందన్నారు.

Also Read : రాతి ఉసిరికాయలు తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?


ప్రభువు త్యాగాన్ని అనుసరించి.. శాంతి మార్గంలో పయనించాలన్నారు. ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలని సూచించారు. ఈర్ష్యా, ద్వేషాలు పారద్రోలాలని పిలుపు నిచ్చారు. అబద్దం, లంచం వంటి పాపాలకు సైతం దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ప్రపంచమంతా జరుపుకొనే ఏకైక పండుగా క్రిస్మన్ అని ఆయన గుర్తు చేశారు.

Also Read: సినిమా ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్లదు.. పుష్పా నిర్మాతతో కలిసి కోమటిరెడ్డి క్లారిటీ


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లాల్లో క్రిస్మస్, సెమీ క్రిస్మస్ వేడుకలు తెలుగుదేశం పార్టీ నిర్వహించిందని సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. మైనార్టీల సంక్షేమానికి, భద్రతకు తాము అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. గతంలో చర్చిలపై దాడులు జరిగితే.. తాను స్వయంగా జోక్యం చేసుకొని కఠిన చర్యలు తీసుకున్నామని వివరించారు. రాష్ట్ర విభజన జరిగిన అనంతరం టీడీపీ ప్రభుత్వం క్రైస్తవుల కోసం తీసుకున్న చర్యలను సైతం సీఎం చంద్రబాబు సోదాహరణగా వివరించారు.

Also Read : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఘరానా మోసం..


ఈ కార్యక్రమంలో మంత్రి ఎన్ ఎం డీ ఫరూఖ్ మాట్లాడుతూ.. వైసీపీ అధినేత వైఎస్ జగన్.. మా వాడు.. మావాడు అని క్రైస్తవులు అనుకున్నారన్నారు. క్రైస్తవులకు వైఎస్ జగన్ ఏం చేశాడో ఏనాడైనా ఆడిగారా ? అని ప్రశ్నించారు. ఉమ్మడి ఏపీలోనే కాదు.. నేడు సైతం క్రైస్తవులకు సీఎం చంద్రబాబు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని వివరించారు. పాస్టర్లకు నగదు ఇచ్చేందుకు బడ్జెట్‌లో నిధులు సైతం కేటాయించారన్నారు. అసలైన సంక్షేమం ఎవరు ఇచ్చారో అంతా ఆలోచన చేయాలంటూ క్రైస్తవులకు ఈ సందర్భంగా మంత్రి ఫరూఖ్ సూచించారు. క్రైస్తవుల్లో, పాలకుల్లో మార్పు రావాల్సి ఉందన్నారు. ఆలోచనల్లో మార్పు తెచ్చుకొని అంతా ఒకే కుటుంబంగా ముందుకు సాగుదామని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. రాష్టాభివృద్ది కోసం అంతా కలిసి ప్రార్ధన చేద్దామన్నారు.

Also Read: పుష్ప సినిమాపై సీతక్క హాట్ కామెంట్స్


ఇక అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణoరాజు మాట్లాడుతూ.. క్రీస్తు మతాన్ని స్వీకరించక పోయినా క్రీస్తు తత్వాన్ని అనుసరించే నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని అభివర్ణించారు. ప్రేమను పంచి, పగను తుంచాలని క్రీస్తు సూక్తిని పాటించే నాయకుడు మన చంద్రబాబు అని పేర్కొన్నారు. నూతన సంవత్సరం వచ్చే వరకూ క్రిస్మస్ వేడుకలు రాష్ట్రంలో ఘనంగా నిర్వహిద్దామని ఈ సందర్భంగా ఆయన పిలుపు నిచ్చారు. విజయవాడలో జరిగిన ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో మంత్రులు సవిత, కొల్లు రవీంద్రతోపాటు స్థానిక ఎంపీ కేశినేని శివనాథ్ తదితరులు పాల్గొన్నారు.

For Andhrapradesh News And Telugu News

Updated Date - Dec 23 , 2024 | 08:05 PM