Share News

AP Congress: అభ్యర్థుల వేటలో కాంగ్రెస్.. దరఖాస్తుల స్వీకరణకు ముహూర్తం ఫిక్స్

ABN , Publish Date - Jan 23 , 2024 | 05:19 PM

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వేటలో నిమగ్నమైంది. బుధవారం (24/01/24) నుంచి అసెంబ్లీ, ఎంపి స్ధానాలకు పోటీ చేసే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు సన్నద్ధమవుతోంది.

AP Congress: అభ్యర్థుల వేటలో కాంగ్రెస్.. దరఖాస్తుల స్వీకరణకు ముహూర్తం ఫిక్స్

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వేటలో నిమగ్నమైంది. బుధవారం (24/01/24) నుంచి అసెంబ్లీ, ఎంపీ స్ధానాలకు పోటీ చేసే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు సన్నద్ధమవుతోంది. 24వ తేదీన విజయవాడలో ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ తొలి అప్లికేషన్‌ తీసుకోనున్నారు. ఇప్పటికే మాజీతో పాటు తాజా ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని ఏపీసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. అటు.. ప్రస్తుతం జిల్లాల పర్యటనలో ఉన్న ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను నేరుగా కలిసి, తమకు అవకాశం ఇవ్వాలని ఆశావహులు కోరుతున్నట్టు తెలిసింది.


మరోవైపు.. ఏపీసీసీ అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వైఎస్ షర్మిల ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగానే ఆమె ఈ నెల 23 నుంచి 9 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు ఈ పర్యటన కొనసాగుతుంది. ఈ పర్యటనలో భాగంగా ఆమె జిల్లాల వారీగా సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేస్తారు. ప్రతిరోజు రెండు జిల్లాల్లో కోఆర్డినేషన్ సమావేశాలు నిర్వహించాలని తలపెట్టారు. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు, ఆశావహుల దరఖాస్తుల స్వీకరణ, జిల్లాలలో పార్టీ పరిస్థితితో పాటు నూతన చేరికలు వంటి అంశాలపై ఆమె ప్రత్యేక దృష్టి సారించారు.

Updated Date - Jan 23 , 2024 | 05:19 PM