Share News

AP DGP: ఎవరైనా దాడులకు పాల్పడితే.. సహించేది లేదు

ABN , Publish Date - Jul 14 , 2024 | 03:17 PM

రాష్ట్రంలో ఎవరైనా దాడులకు పాల్పడితే సహించేది లేదని డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. అది ఏ పార్టీ వారైనా సరే.. వదిలి పెట్టే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు.

AP DGP: ఎవరైనా దాడులకు పాల్పడితే.. సహించేది లేదు
AP DGP Dwaraka Tirumalarao

చిత్తూరు, జులై 14: రాష్ట్రంలో ఎవరైనా దాడులకు పాల్పడితే సహించేది లేదని డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. అది ఏ పార్టీ వారైనా సరే.. వదిలి పెట్టే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు. ఆదివారం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకంలో కొలువైన శ్రీవరసిద్ధి వినాయకస్వామి వారిని ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో డీజీపీ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రజలు అనుకున్నది నెరవేరాలని కోరుకున్నట్లు తెలిపారు. అలాగే ఎలాంటి ఆటంకాలు కలగకుండా విఘ్నాలు తొలగి పోవాలని కాణిపాకం వినాయక స్వామిని పూజించినట్లు తెలిపారు.

Also Read: Puri Ratna Bhandar: పూరీలో తెరుచుకున్న రత్నభాండాగారం.. లోపలకి వెళ్లిన బృందం


అయితే డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే.. నేర పరిశోధన, శాంతి భద్రతలు, ఆలయాలతోపాటు ప్రజలకు భద్రత కల్పించడంపై జిల్లాల ఎస్పీలతో సమీక్ష నిర్వహించానని ఆయన గుర్తు చేశారు. దిశా చట్టం.. ఇంకా పార్లమెంట్‌లో అమల్లోకి రాలేదని.. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగా తీసుకు వచ్చిన చట్టాన్ని కొనసాగిస్తామన్నారు. అయితే రాష్ట్రంలో ఎర్రచందనం, గంజాయి వంటి మత్తు పదార్థాలను అరికట్టేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టాస్క్‌పోర్స్ నిత్యం పని చేస్తోందని రాష్ట్ర డీజీపీ ద్వారక తిరుమలరావు తెలిపారు.


అయితే అంతకుముందు తిరుమలలో శ్రీవారిని డీజీపీ ద్వారకా తిరుమల రావు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం స్వామి వారి సుప్రభాత సేవలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో డీజీపీ దంపతులకు పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 14 , 2024 | 03:17 PM