Home » AP DGP
TDP Leaders: ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను బుధవారంనాడు తెలుగుదేశం నాయకులు కలిశారు. సాక్షి మీడియాపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. సాక్షి మీడియా తప్పుడు రాతలు రాస్తోందని టీడీపీ నేతలు ఆరోపించారు.
CM Chandrababu: తూర్పు గోదావరి జిల్లాలోని నల్లజర్లలో అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించిన ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇలాంటి చర్యలను ఊపేక్షించవద్దని హెచ్చరించారు. ఈ మేరకు ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాతో సీఎం చంద్రబాబు మాట్లాడారు.
Operation Garuda AP: ఏపీ వ్యాప్తంగా ఉన్న అన్ని మెడికల్ షాపుల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, డ్రగ్స్ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆపరేషన్ గరుడ పేరుతో సోదాలు కొనసాగుతున్నాయి.
AP DGP Harish Kumar Gupta: డ్రగ్స్ ఫ్రీ ఏపీగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. డ్రగ్స్ విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరించారు.
AP DGP Dwaraka Tirumala Rao: ఆంధ్రప్రదేశ్లో ఇటీవల నేరాల రేటు తగ్గిందని ఏపీ డీజీపీ ద్వారక తిరుమల రావు తెలిపారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలు 9.5 శాతం తగ్గాయని అన్నారు. రోడ్డు సేఫ్టీపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని డీజీపీ ద్వారక తిరుమల రావు చెప్పారు.
Cyber Crime: టెక్నాలజీ పెరుతున్న తరుణంలో కొత్త తరహా మోసాలు వెలుగుచూస్తున్నాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోదగ్గది సైబర్ ఫ్రాడ్. ఇటీవల కాలంలో ఇలాంటి మోసాలు చాలా ఎక్కువైపోయాయి. బాధితులు మోసం చేయడానికి సైబర్ మోసగాళ్లు పలు రకాల టెక్నిక్లతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు.
AP DGP Dwaraka Tirumala Rao: ఏపీలో గంజాయి విక్రయాలకు ఈగల్ టాస్క్ ఫోర్సును ఏర్పాటుచేసి అడ్డుకట్ట వేస్తున్నామని ఏపీ డీజీపీ ద్వారకాతిరుమలరావు చెప్పారు. ఏపీవ్యాప్తంగా 100 ఎకరాల్లో మాత్రమే గంజాయి సాగు ఉందన్నారు. సీజన్ టైంలో ఉన్న గంజాయి మొక్కలను తొలగించామని అన్నారు.
Dwaraka Tirumala Rao: డిప్యూటీ సీఎం పవన్ భద్రత అంశాన్ని సీరియస్గా విచారణ చేస్తున్నట్లు ఏపీ డీజీపీ తెలిపారు. పవన్ ఇంటిపై డ్రోన్ కెమెరా ఎగిరిన ఘటనపై పోలీస్ శాఖ సీరియస్గా దర్యాప్తు చేస్తోందని.. నిన్న సాయంత్రానికి విచారణ పూర్తి కావాల్సి ఉందన్నారు. డ్రోన్ ఎగరడంపై పోలీసులు ముఖ్యమైన సమాచారాన్ని సేకరించారని తెలిపారు.
Andhrapradesh: సైబర్ క్రైమ్ నేరాలు ఆందోళ కలిగిస్తోందని ఏపీ డీజీపీ ద్వారాక తిరుమల రావు అన్నారు. డిజిటల్ అరెస్టులపై ఎవరు ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. అలాంటి కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లు ఉన్నాయన్నారు.
Andhrapradesh: తిరుమల పరకామణి కేసుకు సంబంధించి గత ప్రభుత్వంలో టీటీడీపై ఓ పోలీస్ అధికారి ఒత్తిడి తెచ్చారని.. ఈ కేసు రాజీకి తీసుకుని వెళ్లిన ఆ పోలీస్ అధికారి ఎవరు అని భాను ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. రూ.100 కోట్లకు పైనే దోపిడీ జరిగిందన్నారు. క్లర్క్ స్థాయి వ్యక్తికి కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని నిలదీశారు. స్వామి వారి సొత్తు తిన్న ప్రతి ఒక్కరినీ కక్కిస్తామని స్పష్టం చేశారు.