Share News

Pawan Kalyan: హైడ్రాపై కీలక వ్యాఖ్యలు.. అసహనం వ్యక్తం చేసిన పవన్

ABN , Publish Date - Sep 04 , 2024 | 07:31 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఎడ తెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా విజయవాడలోని పలు ప్రాంతాలు జలదిగ్బందనంలో చిక్కుకున్నాయి. దీంతో లక్షలాది మంది నగర జీవులు నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బుధవారం అమరావతిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.

Pawan Kalyan: హైడ్రాపై కీలక వ్యాఖ్యలు.. అసహనం వ్యక్తం చేసిన పవన్

అమరావతి, సెప్టెంబర్ 04: ఆంధ్రప్రదేశ్‌లో ఎడ తెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా విజయవాడలోని పలు ప్రాంతాలు జలదిగ్బందనంలో చిక్కుకున్నాయి. దీంతో లక్షలాది మంది నగర జీవులు నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బుధవారం అమరావతిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా పేరుతో చేపట్టిన చర్యలు మంచివేనని తెలిపారు. భవనాలు నిర్మించిన అనంతరం కూల గొట్టడం ద్వారా ఆర్ధికంగా నష్టపోవాల్సి వస్తుందని చెప్పారు. ప్రస్తుతం నిబంధనల‌ ప్రకారం నిర్మాణాలు ఉండేలా చూడాలని ఆయన పేర్కొన్నారు.

Also Read: Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన


బుడమేరు వాగును శాటిలైట్ ద్వారా పరిశీలించి.. అవసరమైన చర్యలు చేపట్టాలని అభిప్రాయపడ్డారు. అందుకు హైడ్రా లాంటి వ్యవస్థ ఏర్పాటు కావాలని ఆకాంక్షించారు. అయితే ఇదే అన్నింటికి పరిష్కారం కాదన్నారు. అదే సమయంలో పేదలను సైతం దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయం చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మనం నిబంధనలు విధించి.. వాటిని పటిష్ఠంగా అమలు చేయాల్సిన బాధ్యత సైతం మనపై ఉందన్న విషయాన్ని విస్మరించరాదని పేర్కొన్నారు. ఆ క్రమంలో నదులు, చెరువులు, కాలువలు ఆక్రమణకు గురి కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు.

Also Read: Minister Thummala: ప్రాణ నష్టం జరగకుండా మున్నేరు గండం గడిచింది


లే అవుట్ల అనుమతి సమయంలో అన్నీ పరిశీలించి.. ఆ తర్వాతే అనుమతులు జారీ చేయాలన్నారు. స్థానిక రాజకీయ నేతలు సైతం ఆక్రమణలు ప్రోత్సహించ కూడదని తెలిపారు. మరో‌ పది, పదిహేనేళ్లకు మరో ప్రభుత్వం వచ్చినా ఇలా ఉండాలని తెలిపారు. మళ్లీ ఇంకొ ప్రభుత్వం రాదనుకోండి... కానీ మనిషి ఆశాజీవి కదా అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Also Read: Vinayaka Chavithi Special 2024: ఇంతకీ పండగ శుక్రవారమా? లేక శనివారమా?.. పండితులు ఏం చెబుతున్నారంటే?..


స్థలాలు ఇస్తున్నామంటూ గత జగన్ ప్రభుత్వం మునిగే ప్రదేశాలను ప్రజలకు కేటాయించిందని ఆరోపించారు. వరద నీటి ముంపునకు గురయ్యే అవకాశముందని తెలిసి కూడా ఆ స్థలాలను ఎలా కేటాయించారని వైసీపీ నేతలను ఈ సందర్బంగా పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ప్రస్తుతం వరదల వల్ల ఆ యా ప్రాంతాలు పూర్తిగా మునిగి పోయాయన్నారు.

Also Read: Vinayaka Chavithi Special 2024: పండగ రోజు విద్యార్థులు ఇలా చేస్తే మాత్రం వారికి తిరుగే ఉండదు..

Also Read: Vinayaka Chavithi Special 2024: ఏ రాశి వారు ఏ నైవేద్యం పెట్టాలి. ఏ మంత్రం చదివి పూజించాలంటే..


వీటీపై ఉన్నతాధికారులతో చర్చించి అవసరమైన చర్యలు చేపడతామన్నారు. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం పరంగా, పార్టీ పరంగా అందరూ పాల్గొనేలా చూస్తామని చెప్పారు. అలాగే అందరితో మాట్లాడి అవసరమైన సాయం అందిస్తామని స్పష్టం చేశారు. ఆక్రమణలు వల్ల ప్రస్తుతం చాలా నష్టం జరిగిందని... అసలు ముందే ఎందుకు చర్యలు తీసుకో లేదని గత ప్రభుత్వ పెద్దలను డిప్యూటీ సీఎం పవన్ ప్రశ్నించారు. నదులు, కాలువలను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే గత ప్రభుత్వం ఏం చేస్తుందని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

Also Read: YS Sahrmila: బ్యారేజీ గేట్లు విరిగిపోయిన ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాలి

మరిన్నీ ఆంధ్రపద్రేశ్ వార్తలతోపాటు తెలుగు వార్తలు కోసం ..

Updated Date - Sep 04 , 2024 | 08:18 PM