Share News

విజయవాడ, విశాఖ మెట్రోరైల్‌ ప్రాజెక్టు డీపీఆర్‌కు ఆమోదం

ABN , Publish Date - Dec 03 , 2024 | 04:55 AM

విజయవాడ, విశాఖపట్నం మెట్రోరైల్‌ ప్రాజెక్టు డీపీఆర్‌ ఆమోదానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

విజయవాడ, విశాఖ మెట్రోరైల్‌ ప్రాజెక్టు డీపీఆర్‌కు ఆమోదం

అమరావతి, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): విజయవాడ, విశాఖపట్నం మెట్రోరైల్‌ ప్రాజెక్టు డీపీఆర్‌ ఆమోదానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. విజయవాడ మెట్రో ఫేజ్‌-1లో గన్నవరం నుంచి బస్టాండ్‌ వరకు, బస్టాండ్‌ నుం చి పెనమలూరు వరకు రూపొందించిన డీపీఆర్‌ను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఏపీ మెట్రోరైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ద్వారా విజయవాడలో మెట్రోరైల్‌ ప్రాజెక్టును 2 దశల్లో నిర్మించాలని యోచిస్తున్నారు. ఫేజ్‌-1 లో రూ.11,009 కోట్లతో 38.40 కిలోమీటర్ల మేర 1ఏ, 1బీ కారిడార్లను, రూ.1,152 కోట్లతో భూసేకరణను రాష్ట్ర ప్రభు త్వ వ్యయంతో చేపట్టనున్నారు. ఫేజ్‌-2లో మూడో కారిడార్‌ ను 27.75 కి.మీ మేర చేపట్టనున్నారు. అదేవిధంగా విశాఖపట్నం మెట్రోరైల్‌ ప్రాజెక్టును కూడా 2 దశల్లో చేపట్టాలని నిర్ణయించారు. ఫేజ్‌-1లో రూ.11,498 కోట్లతో 46.23 కి.మీ మేర 3 కారిడార్లు నిర్మిస్తారు. మొదటి దశలో విశాఖపట్నం మెట్రోరైల్‌ ప్రాజెక్టును అమలు చేసేందుకు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

Updated Date - Dec 03 , 2024 | 04:55 AM