Share News

AP Government: ఏబీ వెంకటేశ్వరరావుపై ప్రభుత్వం కక్ష సాధింపు..

ABN , Publish Date - May 18 , 2024 | 07:12 AM

సీనియర్ పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావుపై ప్రభుత్వం కక్ష సాధింపునకు దిగింది. పోస్టింగ్ ఇవ్వకుండా పదవీ విరమణ చేయించేందుకు ఎత్తుగడ వేసింది. రెండవ సారి సస్పెన్షన్‌ను క్యాట్ కొట్టివేసింది. వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. క్యాట్ ఆదేశాలను చీఫ్ సెక్రటరీకి ఏబీ ఇచ్చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం ఫైల్‌ను ఎలక్షన్ కమిషన్‌కు పంపాలని అధికార వర్గాలు చెబుతున్నాయి.

AP Government: ఏబీ వెంకటేశ్వరరావుపై ప్రభుత్వం కక్ష సాధింపు..

అమరావతి: సీనియర్ పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావుపై ప్రభుత్వం కక్ష సాధింపునకు దిగింది. పోస్టింగ్ ఇవ్వకుండా పదవీ విరమణ చేయించేందుకు ఎత్తుగడ వేసింది. రెండవ సారి సస్పెన్షన్‌ను క్యాట్ కొట్టివేసింది. వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. క్యాట్ ఆదేశాలను చీఫ్ సెక్రటరీకి ఏబీ ఇచ్చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం ఫైల్‌ను ఎలక్షన్ కమిషన్‌కు పంపాలని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఏబీ వెంకటేశ్వర రావు ఫైల్‌ను సీఎం జగన్‌కు చీఫ్ సెక్రటరీ పంపించారు.


క్యాట్ తీర్పుపై అప్పీల్‌కు వెళ్ళాలని ఫైల్‌పై జగన్ రాశారు. మొన్న హై కోర్టులో ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. చీఫ్ జస్టిస్ అనుమతి లేకుండా వెకేషన్ కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ను అనుమతించబోమని హైకోర్టు పేర్కొంది. ఈ నెల 31న ఏబీ వెంకటేశ్వరరావు పదవీ విరమణ చేయనున్నారు. వెంకటేశ్వరరావుపై ప్రభుత్వం కావాలని కక్ష సాధింపు చర్యలకు దిగిందని కొంతమంది అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి..

Jagan : లగ్జరీ ఫ్లైట్‌లో పేదింటి బిడ్డ!

వైసీపీ పోలీసింగ్‌పై కొరడా!

Read more AP News and Telugu News

Updated Date - May 18 , 2024 | 07:12 AM