AP Govt : పలు శాఖల్లో సెక్షన్ ఆఫీసర్ల బదిలీలు
ABN , Publish Date - Dec 06 , 2024 | 05:01 AM
ప్రభుత్వ శాఖల్లో దీర్ఘకాలంగా విధులు నిర్వహిస్తోన్న సెక్షన్ అధికారులను ఇతర శాఖలకు బదిలీ చేస్తూ జీఏడీ సర్వీసెస్ కార్యదర్శి పోల భాస్కర్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు.
అమరావతి, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ శాఖల్లో దీర్ఘకాలంగా విధులు నిర్వహిస్తోన్న సెక్షన్ అధికారులను ఇతర శాఖలకు బదిలీ చేస్తూ జీఏడీ సర్వీసెస్ కార్యదర్శి పోల భాస్కర్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. పరిశ్రమలు, వాణిజ్యం శాఖలో ఎస్‌ఓలుగా పనిచేస్తున్న వి.నాగేశ్వరరావు, కె.రూపలను వరుసగా రెవెన్యూ, మున్సిపల్ పరిపాలనా శాఖలకు బదిలీ చేశారు. పరిశ్రమల శాఖ సెక్షన్ ఆఫీసర్లు బి.రాధాకుమారిని మున్సిపల్ పరిపాలనా విభాగానికి వి.శ్రీనివాసులును రోడ్లు, భవనాల శాఖకు, పి.రామమోహన్‌ను రవాణా, రోడ్లు, భవనాల శాఖకు మార్చారు. ఆర్.సీహెచ్.వెంకటేశ్వరరావు, వి.శేఖర్‌లను వరుసగా రెవెన్యూ, వ్యవసాయం-సహకార శాఖలకు బదిలీ చేశారు. అదేవిధంగా జలవనరుల శాఖలో ఎస్‌ఓలుగా పనిచేస్తున్న ఎం.వి.రమణారావు, ఎం.సుధారాణిలను వరుసగా ఈఎ్‌ఫఎస్ అండ్ టి డిపార్ట్‌మెంట్, పరిశ్రమలు-వాణిజ్య శాఖకు, ఎ.శంకరరావు, కె.లీలావతిలను వ్యవసాయం-సహకారశాఖకు, కె.బాబూరావు, పి.బాలచౌదరయ్య, డి.కృష్ణమెహన్‌లను వరుసగా పరిశ్రమల శాఖ, సాధారణ పరిపాలనా శాఖ, ప్రణాళికా శాఖలకు బదిలీ చేశారు. అదే శాఖలోని జి.లక్ష్మణరావు, వి.రామారావు, జి.సాహిత్యలను పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖకు, ఎల్.కొండారెడ్డి, ఆర్.ప్రసాదరావులను జీఏడీకి, భానుమూర్తి, పి.శ్రీనివాసరావు, పి.జనార్దన్‌రావు, షేక్ హఫీజ్, కె.సురేశ్ చౌదరిలను హోంశాఖ, మున్సిపల్-పట్టణాభివృద్ధి, పరిశ్రమలు-వాణిజ్య శాఖ, టీఆర్ ఆండ్ బీ, వైద్య ఆరోగ్యం-కుటుంబ సంక్షేమ శాఖ పంపారు.