Share News

CM Chandrababu: ఆ రెండు నగరాలకు మెట్రో రైల్‌.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ABN , Publish Date - Dec 02 , 2024 | 08:53 PM

విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్ట్ మొదటి దశ డీపీఆర్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అందుకు సంబంధించిన డీపీఆర్‌ను కేంద్రానికి పంపనుంది.

CM Chandrababu: ఆ రెండు నగరాలకు మెట్రో రైల్‌.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
AP CM Chandrababu Naidu

అమరావతి, డిసెంబర్ 02: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాలైన విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్ట్ మొదటి దశ డీపీఆర్‌ను చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం సోమవారం ఆమోదించింది. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు మొదటి దశలో 46.23 కిలోమీటర్ల మేర మూడు కారిడార్లను ప్రభుత్వం నిర్మించనుంది.

Also Read: కాకినాడ పోర్ట్‌కు ఐపీఎస్‌ అధికారి.. సీఎం కీలక నిర్ణయం


విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకూ 34.4 కిలోమీటర్ల మేర ఒకటో కారిడార్‌గా డీపీఆర్‌లో ప్రభుత్వం పేర్కొంది. ఇక గురుద్వారా నుంచి పాతపోస్ట్ ఆఫీసు వరకూ రెండో కారిడార్‌ను 5.08 కిలోమీటర్ల మేర నిర్మించనుంది. మూడో కారిడార్‌గా తాడిచెట్లపాలెం నుంచి చినవాల్తేర్ వరకూ 6.75 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకుంది.

Also Read: ఇన్ఫోసిస్‌కు పెద్ద ఎదురుదెబ్బ..రూ.238 కోట్ల భారీ జరిమానా

Also Read: తిరుమల రెండో ఘాట్ రోడ్డులో యువకుల హల్‌చల్


మొదటి దశలో మొత్తం రూ. 11,498 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తుంది. అలాగే రెండో దశలో కొమ్మాది నుంచి భోగాపురం విమానాశ్రయం వరకూ 30.67 కిలోమీటర్ల మెట్రో రైల్ కారిడార్ నిర్మాణం చేపట్టనుంది. ఈ మేరకు పురపాలక శాఖ కార్యదర్శి కె.కన్నబాబు ఉత్తర్వులు జారీ చేశారు.

Also Read: కొత్త ఇంటికి శ్రద్ధా.. ఎక్కడంటే..

Also Read: తిరుమల రెండో ఘాట్ రోడ్డులో యువకుల హల్‌చల్


విజయవాడలో..

విజయవాడ నగరంలో రెండు దశలుగా మెట్రోరైల్ ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. మొదటి దశలో రెండు కారిడార్‌లు, రెండో దశలో మరో కారిడార్ నిర్మాణం చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మొదటి దశలో కారిడార్ 1ఏగా గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకూ మెట్రో రైల్ నిర్మాణం చేపట్టనుంది.

Also Read: ఈ ఐపీఎస్‌ను కాలం ఎంతలా పగబట్టిందంటే..

Also Read: నామినేటేడ్ పోస్టులపై కసరత్తు.. మరో 15 రోజుల్లో ప్రకటన


కారిడార్1 బిగా పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకూ మెట్రో రైల్ ప్రాజెక్ట్ నిర్మించనున్నారు. ఇక రెండో దశలో కారిడార్ 3గా పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతి వరకూ ప్రాజెక్టు నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. మొదటి దశ కారిడార్ 1ఏ, 1బిలను 38.4 కిలోమీటర్ల మేర నిర్మించాలని డీపీఆర్‌లో ప్రతిపాదన చేసింది.

Also Read: వరద నీటిలో కొట్టుకు పోయిన బస్సులు, కార్లు.. ఎక్కడంటే..

Also Read: పవన్‌ని చూస్తే.. గబ్బర్ సింగ్ 3 గుర్తుకు వస్తుంది


దీనికి రూ.11,009 కోట్ల వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. మొదటి దశ కారిడార్ 1ఏ,1బిల భూసేకరణకు రూ.1152 కోట్ల రూపాయల వ్యయం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని డీపీఆర్‌లో స్పష్టం చేస్తుంది. ఇక రెండో దశలో నిర్మించే మూడో కారిడార్ ను 27.5 కిలోమీటర్ల మేర నిర్మించాలని నిర్ణయం. విజయవాడ, విశాఖ మెట్రోరైల్‌కు సంబంధించిన డీపీఆర్‌లను కేంద్రానికి పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది.

For AndhraPradesh News And Telugu news

Updated Date - Dec 02 , 2024 | 08:55 PM