Share News

AP High Court: ఎన్నికల వేళ.. వైసీపీకి మళ్లీ దెబ్బ

ABN , Publish Date - Apr 24 , 2024 | 04:42 PM

ఎన్నికల వేళ.. అధికార వైసీపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఆ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. అధికార వైసీపీ వల్ల బాధిత కుటుంబాలుగా మారిన టీడీపీ సానుభూతిపరుల కుటుంబాలకు రక్షణ కల్పించాలని రెసిడెంట్లు.. కేంద్ర ఎన్నికల ఎన్నికల సంఘం, డీజీపీ, పల్నాడు ఎస్పీలను ఏపీ హైకోర్ట్ ఆదేశించింది.

AP High Court: ఎన్నికల వేళ.. వైసీపీకి మళ్లీ దెబ్బ

అమరావతి, ఏప్రిల్ 24: ఎన్నికల వేళ.. అధికార వైసీపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఆ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. అధికార వైసీపీ వల్ల బాధిత కుటుంబాలుగా మారిన టీడీపీ సానుభూతిపరుల కుటుంబాలకు రక్షణ కల్పించాలని రెసిడెంట్లు.. కేంద్ర ఎన్నికల ఎన్నికల సంఘం, డీజీపీ, పల్నాడు ఎస్పీలను ఏపీ హైకోర్ట్ ఆదేశించింది.

PM Modi: ‘బతికుండగానే కాదు.. చనిపోయిన తర్వాత దోచుకుంటుంది’

పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50 టిడిపి సానుభూతి కుటుంబాలతోపాటు జంగామేశ్వరపాడు గ్రామంలోని 30 టిడిపి కుటుంబాల గ్రామ బహిష్కరణపై బుధవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఆ క్రమంలో వాదోపవాదనలు విన్న న్యాయస్థానం టీడీపీ సానుభూతిపరులకు అనుకూలంగా తీర్పు వెలువరించింది.

2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారం చేపట్టింది. అనంతరం రాష్ట్రంలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ సానుభూతిపరుల కుటుంబాలపై వైసీపీ నేతలు దాడి చేసి.. గ్రామ బహిష్కరణ చేశారు. మళ్లీ ఈ గ్రామాల్లో అడుగు పెడితే చంపేస్తామంటూ.. టీడీపీ సానుభూతిపరుల కుటుంబాలను వైసీపీ నేతలు హెచ్చరించారు.

Lok Sabha elections: ఎల్లుండే రెండో దశ పోలింగ్‌


దీంతో అధికార పార్టీ నేతల బెదిరింపులు తాళలేక వారంతా వేర్వేరు గ్రామాల్లో తలదాచుకుంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో తమకు ప్రాణ రక్షణ కల్పించాలంటూ.. బాధిత కుటుంబాలు హైకోర్టును ఆశ్రయించారు. ఆ క్రమంలో న్యాయస్థానంలో పలుమార్లు వాదోపవాదాలు జరిగాయి. అందులోభాగంగా బాధిత కుటుంబాలకు రక్షణ కల్పించాలంటూ న్యాయస్థానాన్ని పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోరారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదుల వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది.

Rahul Gandhi: సంపద పునఃపంపిణీ వివాదంపై రాహుల్ గాంధీ క్లారిటీ

దీంతో బాధిత కుటుంబాలకు రక్షణ కల్పించాలని, గ్రామంలో ప్రశాంత జీవనం కల్పించాలని ఈ సందర్భంగా పోలీసులను హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్ తరఫు న్యాయవాదులుగా నర్రా శ్రీనివాస్, ముప్పాళ్ల బాలకృష్ణ వ్యవహరించారు. న్యాయస్థానం తీర్పుతో బాధిత కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

Read National News and Telugu News

Updated Date - Apr 24 , 2024 | 04:42 PM