AP High Court : వారి జీపీఎఫ్‌పై నిర్ణయం తీసుకోండి
ABN , Publish Date - Dec 21 , 2024 | 05:34 AM
కోర్టుకు వచ్చిన విద్యుత్ ఉద్యోగులకు జీపీఎఫ్ వర్తింపు చేసే విషయంలో నిబంధనలకు లోబడి మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ, ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శులను హైకోర్టు ఆదేశించింది.
ఆర్థిక, ఇంధన శాఖల ముఖ్యకార్యదర్శులకు హైకోర్టు ఆదేశం
అమరావతి, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): కోర్టుకు వచ్చిన విద్యుత్ ఉద్యోగులకు జీపీఎఫ్ వర్తింపు చేసే విషయంలో నిబంధనలకు లోబడి మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ, ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శులను హైకోర్టు ఆదేశించింది. జీపీఎఫ్ వర్తింపచేయాలా, ఈపీఎఫ్ స్కీం అమలుచేయాలా అనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, ఏ స్కీం అమలు చేయాలనే విషయంలో ప్రభుత్వాన్ని ఆదేశించలేమని పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. తమకు జీపీఎఫ్ అమలు చేసేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ విద్యుత్ పంపిణీ సంస్థల్లో పనిచేస్తున్న, రిటైరైన ఉద్యోగులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీరి తరఫున న్యాయవాది పీటా రామన్ వాదనలు వినిపించారు.