Share News

AP High Court: వైసీపీ ఆఫీసుల విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు..

ABN , Publish Date - Jul 04 , 2024 | 11:58 AM

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీ (YSRCP) కార్యాలయాలన్నీ అక్రమంగా నిర్మించారని టీడీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో...

AP High Court: వైసీపీ ఆఫీసుల విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ (YSRCP) ఆఫీసుల విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. చట్ట నిబంధనలు అనుసరించాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. అంతేకాదు.. 2 నెలల్లో భవనాల అనుమతులు, ఆధారాలు, రికార్డులు అధికారుల ముందు ఉంచాలని వైసీపీని న్యాయస్థానం ఆదేశించింది. తగినంత సమయం ఇచ్చి వివరణ తీసుకున్నాక కట్టడాల విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించడం జరిగింది. ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా, ప్రమాదకరంగా ఉంటే తప్ప కూల్చివేత వంటి నిర్ణయాలు తీసుకోవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ వ్యాజ్యాలపై విచారణను హైకోర్టు మూసివేసింది.


అసలేం జరిగింది..?

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీ (YSRCP) కార్యాలయాలన్నీ అక్రమంగా నిర్మించారని టీడీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని అధికారులు దగ్గరుండి మరీ భారీ బందబోస్తు మధ్య కూల్చివేయడం జరిగింది. మరోవైపు.. రాష్ట్రంలోని పలు వైసీపీ కార్యాలయాలకు కూడా సంబంధిత అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. దీంతో ఈ ఘటనపై హైకోర్టును ఆశ్రయించింది వైసీపీ. గురువారం నాడు


పిటిషన్ ఇలా..!

కాగా.. వైసీపీ కార్యాలయం విషయంలో చట్టనిబంధనలకు లోబడి వ్యవహరించాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించి అధికారులు నిర్మాణాన్ని కూల్చివేశారని, బాధ్యులైన అధికారులపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ వైసీపీ హైకోర్టులో కోర్టుధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎం.శేషగిరిరావు ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. సీఆర్డీఏ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌, తాడేపల్లి-మంగళగిరి మున్సిపల్‌ కమిషనర్‌ నిర్మల్‌కుమార్‌లను వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు.

Updated Date - Jul 04 , 2024 | 12:27 PM