Share News

AP News: మధ్యాహ్న భోజనం సూపర్‌..

ABN , Publish Date - Dec 11 , 2024 | 12:30 PM

మధ్యాహ్న భోజనం మంచి నాణ్యతతో ఉందని రాష్ట్ర ఫుడ్‌ కమిటీ చైర్మన్‌ విజయప్రతాప్‏రెడ్డి(Vijaya Pratap Reddy) ప్రశంసించారు. ఆయన మంగళవారం తాడిపత్రి, మండల పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలను తనిఖీ చేశారు.

AP News: మధ్యాహ్న భోజనం సూపర్‌..

- రాష్ట్ర ఫుడ్‌ కమిటీ చైర్మన్‌ విజయప్రతాప్‏రెడ్డి

తాడిపత్రి(అనంతపురం): మధ్యాహ్న భోజనం మంచి నాణ్యతతో ఉందని రాష్ట్ర ఫుడ్‌ కమిటీ చైర్మన్‌ విజయప్రతాప్‏రెడ్డి(Vijaya Pratap Reddy) ప్రశంసించారు. ఆయన మంగళవారం తాడిపత్రి, మండల పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలను తనిఖీ చేశారు. స్థానిక త్రిబుల్‌ఎస్‌ ఎంఆర్‌ఎంలో మధ్యాహ్న భోజనంలోని అన్నం, పప్పు, రసం, చిత్రాన్నం, పులిహోర, పెరుగన్నం పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం తిన్నారు. అనంతరం నాణ్యత తదితర అంశాలపై ఆరాతీశారు.

ఈ వార్తను కూడా చదవండి: AP Govt: ఏపీ నూతన పర్యాటక పాలసీ 2024-29 రిలీజ్


ఇంత నాణ్యమైన భోజనాన్ని మెను ప్రకారం ఇవ్వడం చాలా గ్రేట్‌ అని కితాబిచ్చారు. మధ్యాహ్నభోజనాన్ని ఎవరు చేయిస్తున్నారని ఆరాతీయగా ఎమ్మెల్యే జేసీ అశ్మిత్‌రెడ్డి(MLA JC Ashmit Reddy), మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో శైలజాసేవాట్రస్ట్‌ నిర్వాహకుడు అరవింద నారాయణరెడ్డి ఆధ్వర్యంలో భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఇంత నాణ్యమైన భోజనం రాష్ట్రంలో ఎక్కడా లేదన్నారు. అనంతరం అరవింద నారాయణరెడ్డి ఇంటివద్దకు వెళ్లి ముందు ముందు కూడా ఇలాగే చేయాలని ప్రోత్సహించారు.


pandu1.jpg

అనంతరం ఆయనకు శాలువాకప్పి సన్మానించారు. అంతకుమునుపు జయనగర్‌కాలనీలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని, రైల్వేస్టేషన్‌ సమీపంలో ఉన్న జూటూరుకాలనీలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాన్ని, చుక్కలూరు అంగన్‌వాడీ కేంద్రాలతోపాటు చుక్కలూరు హైస్కూల్‌ను తనిఖీచేసి భోజనాన్ని పరిశీలించారు. ఆయన వెంట ఎంఈఓ నాగరాజు, సివిల్‌సప్లై అధికారి మారుతీప్రసాద్‌రెడ్డి, సీడీపీఓ సాజిదాబేగం, సూపర్‌వైజర్లు, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.


ఈవార్తను కూడా చదవండి: విగ్రహాల మీద ఉన్న ధ్యాస విద్యార్థుల మీద లేదా?

ఈవార్తను కూడా చదవండి: తినే మాంసంలో.. యాంటీబయాటిక్స్‌

ఈవార్తను కూడా చదవండి: సింగరేణి సీఎండీ రేసులో శైలజా రామయ్యర్‌!

ఈవార్తను కూడా చదవండి: ఆన్‌లైన్‌లో భద్రాద్రి ముక్కోటి దర్శన టికెట్లు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 11 , 2024 | 12:30 PM