Share News

Amaravathi: సీట్లు రాని టీడీపీ నేతలకు బుజ్జగింపులు.. రాజకీయ భవిష్యత్తుకి చంద్రన్న హామీ

ABN , Publish Date - Mar 22 , 2024 | 08:25 PM

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే టీడీపీ అభ్యర్థుల 3వ లిస్టు కూడా రిలీజ్ కావడంతో టికెట్లు రాని వారు అసంతృప్తిలో పడిపోయారు. వారిని బుజ్జగించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) రంగంలోకి దిగారు.

Amaravathi: సీట్లు రాని టీడీపీ నేతలకు బుజ్జగింపులు.. రాజకీయ భవిష్యత్తుకి చంద్రన్న హామీ

అమరావతి: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే టీడీపీ అభ్యర్థుల 3వ లిస్టు కూడా రిలీజ్ కావడంతో టికెట్లు రాని వారు అసంతృప్తిలో పడిపోయారు. వారిని బుజ్జగించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) రంగంలోకి దిగారు. పొత్తులో భాగంగా సీట్లు కోల్పోయిన వారిని సైతం బాబు బుజ్జగిస్తున్నారు.

అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంలో వారికి తగిన ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. టికెట్ ఆశించి భంగపడ్డ ఆలపాటి రాజాను వేముల టీడీపీ అభ్యర్థి నక్కా ఆనంద్ బాబు.. చంద్రబాబు దగ్గరికి తీసుకువచ్చారు. ఎంఎస్ రాజు సైతం శుక్రవారం రాత్రి చంద్రబాబుతో భేటీ కానున్నారు.

రాజు బాపట్ల ఎంపీ టికెట్ ఆశించారు. టీడీపీ అభ్యర్థుల మూడో జాబితాను అధినేత చంద్రబాబు శుక్రవారం విడుదల చేశారు. ఇవాళ 11 అసెంబ్లీ.. 13 ఎంపీ స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించారు. ఇదివరకే 128 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా మరో 11 మందిని వెల్లడించింది. 5 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలను పెండింగులో ఉంచింది. టీడీపీ టికెట్లకు భారీగా పోటీ ఉండటంతో కొన్ని చోట్ల ఆశావహులకు నిరాశ తప్పలేదు.

Updated Date - Mar 22 , 2024 | 08:26 PM