Share News

Aravindo Pharma : మేం చెయ్యం!

ABN , Publish Date - Dec 04 , 2024 | 03:53 AM

అరబిందో సంస్థ 108 అంబులెన్సులు, 104 వాహనాల నిర్వహణ నుంచి తప్పుకొనేందు కు సిద్ధమైంది. కూటమి అధికారంలోకి వచ్చి న తర్వాత అరబిందో సంస్థ పెద్ద తలనొప్పి గా మారింది. 108, 104 సేవలను సక్రమం గా అందించకపోవడంతోపాటు ఉద్యోగులకు సక్రమంగా జీతాలు కూడా చెల్లించడం లేదు.

Aravindo Pharma : మేం చెయ్యం!

  • ప్రభుత్వానికి ‘అరబిందో’ మరో లేఖ

  • 108, 104 నిర్వహణ నుంచి తప్పుకొంటున్న సంస్థ

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

అరబిందో సంస్థ 108 అంబులెన్సులు, 104 వాహనాల నిర్వహణ నుంచి తప్పుకొనేందు కు సిద్ధమైంది. కూటమి అధికారంలోకి వచ్చి న తర్వాత అరబిందో సంస్థ పెద్ద తలనొప్పి గా మారింది. 108, 104 సేవలను సక్రమం గా అందించకపోవడంతోపాటు ఉద్యోగులకు సక్రమంగా జీతాలు కూడా చెల్లించడం లేదు. దీంతో ఉద్యోగులు ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇవ్వడంతోపాటు కొన్ని చోట్ల నిరసన లు తెలిపారు. అరబిందో సంస్థతో ప్రభుత్వం చర్చలు జరిపినా ఆ సంస్థ నుంచి స్పందన సక్రమంగా లేదు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సేవలు కొనసాగించేందు కు ఆ సంస్థ సుముఖంగా లేదు. తాము సేవ లు అందించలేమంటూ ప్రభుత్వానికి 8 సార్లు లేఖలు రాసింది. ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదంటూ రచ్చరచ్చ చేస్తోంది. తమ కాంట్రాక్ట్‌ను మరొక సంస్థకు ఇవ్వాలని అక్టోబరులో రాసిన లేఖలో ప్రభుత్వానికి సూచనలు చేసింది. 108, 104 సేవలను కొనసాగించలేమంటూ తాజాగా నవంబరు 25న మరో లేఖ రాసింది. వైసీపీ ప్రభుత్వం కూడా అరబిందో సంస్థకు కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది. అప్పుడు నోరెత్తని అరబిందో సంస్థ కూటమి ప్రభుత్వంలో మాత్రం బిల్లు లు రావడం లేదని రచ్చ చేస్తోంది. కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకూ రూ.70-80 కోట్ల వరకూ విడుదల చేసింది. అయినా ఆ సంస్థ ప్రతినిధులు ప్రభుత్వంపై బురద జల్లేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఆ సం స్థను తప్పించేందుకు ప్రభుత్వం కూడా అం గీకరించింది. 108, 104 సేవలను సక్రమంగా కొనసాగించేందుకు అరబిందోను తప్పించడ మే కరెక్టని ప్రభుత్వం నిర్ణయించింది. అరబిందో సంస్థ 108, 104 ఉద్యోగులకు నరకం చూపిస్తోంది. 102 వాహనాలు(తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌) ఉద్యోగులకు కూడా ఆ సంస్థ సక్రమం గా జీతాలు చెల్లించడం లేదు. ఇదేమిటని ప్రశ్నిస్తే ప్రభుత్వం నుంచి బిల్లులు రావడం లేదని సాకులు చెబుతోంది.

Updated Date - Dec 04 , 2024 | 03:53 AM